TG: జనగామ జిల్లా శక్తి డెయిరీలో పేలుడు సంభవించింది. ఒవెన్ పేలడంతో నలుగురికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషయంగా ఉంది. ఓవెన్ చల్లారకముందే ఓపెన్ చేయడంతో పేలుడు జరిగింది. ఈ ప్రమాదం దాటికి బాదం సీసాలు పగిలిపోయి సీసాల ముక్కలు కార్మికులకు గుచ్చుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
TG: ఫాల్కాన్ సీవోవో వికాస్‌కుమార్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 7,056 మంది డిపాజిటర్ల నుంచి రూ.4,215 కోట్లను ఫాల్కాన్ సంస్థ వసూలు చేసింది. రూ.792 కోట్ల స్కామ్‌కు ఫాల్కాన్ సంస్థ పాల్పడింది. దేశవ్యాప్తంగా ఫాల్కాన్‌పై 10 కేసులు నమోదు అయ్యాయి.
బెంగళూరులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 175 దుకాణాలు ఉన్న భవన సముదాయంలో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తున్నారు. నగరంలోని చిక్కపేట పరిధిలోని కుంబారపేటలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం కొండయ్యపేటకు చెందిన గొంతి అభిషేక్(28) అనే వ్యక్తి లండన్‌లో మృతి చెందాడు. లండన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి జీడీకే 11వ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. గనిలో బొగ్గు సైడ్ ఫాల్ కావడంతో విధులు నిర్వహిస్తున్న కోల్ కట్టర్ ఐలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన నడుము, కాలికి దెబ్బలు తగలడంతో వెంటనే గోదావరిఖని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి HYDకు తరలించారు. ఈ ఘటనతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది.
TG: నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీలో విషాదం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు. విద్యార్థిని బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రిని తుపాకీతో కాల్చి చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి డ్రమ్ములో పెట్టిన ఘటన యూపీలో జరిగింది. అక్షత్ అనే యువకుడు తన తండ్రి మానవేంద్ర సింగ్(50)ను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం మృతదేహాన్ని రంపంతో ముక్కలుగా కోసి డ్రమ్ములో పెట్టాడు. మర్నాడు తన తండ్రి కనబట్లేదని పోలీసుల ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
భారత్‌లో సైబర్ దాడులు తీవ్రమవుతున్నాయి. 2025తో పోలిస్తే ఈ ఏడాది దాడులు 2 శాతం పెరిగి, వారానికి సగటున 3,195కి చేరాయి. ముఖ్యంగా AI సాయంతో విద్యా, ప్రభుత్వ రంగాలపై దాడులు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ఎక్కువగా ప్రభావితం కాగా, 70శాతం దాడులు ప్రమాదకరమైన ట్రోజన్ మాల్వేర్‌తోనే సాగుతున్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ఇంటర్నెట్ వాడకంలో అప్రమత్తత చాలా అవసరం.
ATP: బెళుగుప్ప మండలం నరసాపురం గ్రామ సచివాలయ ఉద్యోగి కార్తీక్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ విషయాన్ని డిప్యూటీ ఎంపీడీవో ఏకాంబరేశ్వరయ్య బుధవారం మీడియాకు తెలిపారు. ఇటీవల పింఛన్ నగదు రూ.96 వేలను సకాలంలో ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెన్షన్ విధించినట్లు వెల్లడించారు.
AP: తిరుపతిలో చిన్నారి దుర్గ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. దుర్గను తల్లి ఆశాలత, ఆమె ప్రియుడు రెడ్డికుమారే హతమార్చినట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం తిరుపతి బ్లిస్ కూడలిలో అదృశ్యం కేసు నమోదైంది. తన కుమార్తె అదృశ్యమైందని తల్లి ఫిర్యాదు చేసింది. అనుమానంతో చిన్నారి తల్లి, ఆమె ప్రియుడిని విచారించగా తామే హత్య చేసి మృతదేహాన్ని స్వర్ణముఖి నదిలో పూడ్చిపెట్టినట్లు తెలిపారు.
ATP: తాడిపత్రి రూరల్ పరిధిలోని ఆర్డీటీ కాలనీ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్ ఇంజన్ భాగాలు రెండుగా విడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని సేఫ్టీ బెలూన్లు (ఎయిర్ బ్యాగులు) తెరుచుకోవడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని ఒడిశాకు చెందిన 16 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని, తమ్ముడిని హత్యచేసింది. అనంతరం వారి మృతదేహాలను సమీప కాలువలో పడేసింది. కొరాపుట్ జిల్లా బొరిగుమ్మలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తమ్ముడు ఈహేం పరిఢా(14) మృతదేహం లభ్యం కాగా.. తల్లి అనుష్క(45) బాడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
E.G: గోకవరం మండలంలోని ఓ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలికను వేధించిన రాకేశ్ అనే యువకుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడు నిత్యం వేధిస్తున్నాడని బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో గోకవరం SI పవన్ కుమార్ కేసు నమోదు చేశారు. నిందితుడిని రాజంమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.
E.G: నిడదవోలు మండలం సమిశ్రగూడెంలోని రొయ్యల చెరువులో మంగళవారం ఒక మృతదేహం లభ్యమైంది. మృతుడిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన మోతీ పరదార్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న సమిశ్రగూడెం SI సుందర్ బాలాజీ రావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
సత్యసాయి: నల్లమాడ మండల పరిధిలోని రెడ్డిపల్లి ప్రాంతంలో జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 4,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించినట్లు పేర్కొన్నారు.