TG: నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శేఖర్ అనే వ్యక్తి రూ.28 కోట్ల అప్పు చేసి మరణించాడు. స్థానికులకు అధిక వడ్డీ ఆశజూపి భారీ మొత్తంలో అప్పలు చేశాడు. శేఖర్ మృతి చెందడంతో బాధితులు అతడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
TG: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లితో పాటు నాలుగేళ్ల కుమారుడు మృతి చెందాడు. మృతులు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామస్థులుగా గుర్తించారు. యాదగిరిగుట్టకు వెళ్తుండగా ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. దీంతో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. పంట కాల్వ గుంతలో బోల్తా పడిన బస్సును క్రేనుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. విశాఖ నుంచి ప్రైవేటు ట్రావెల్ బస్సు చెన్నై వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
భారత సైన్యం నిర్వహించిన పారాచూట్ శిక్షణ విన్యాసంలో ప్రమాదం సంభవించింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లా పి.డి. హళ్ళి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ల్యాండింగ్ సమయంలో పారాచూట్ సరిగా పనిచేయకపోవడంతో ఇద్దరు సైనికులు సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడి గాయపడ్డారు. ఘటనలో గాయపడిన ఇద్దరు సైనికుల్లో ఒకరు 25 ఏళ్ల చిన్నరాజ్ అని తెలుస్తోంది.
TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన కార్తిక్ షా అనే ప్రయాణికుడి నుంచి 1990 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
TG: హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని బాబా ఫంక్షన్ హాల్‌కు ఎదురుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
AP: పార్వతీపురం పి.కోనవలస చెక్‌పోస్ట్ దగ్గర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి గ్యాస్ లారీ బోల్తా పడింది. దీంతో లారీ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో స్ధానికులు భయపడుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
AP: పోలండ్‌లో మృతి చెందిన విశాఖ జిల్లా వాసి ప్రసాద్‌బాబు(45) మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాన్ని వార్సా నుంచి తుర్కియేలోని ఇస్తాంబుల్ మీదుగా ఆదివారం రాత్రికి HYDకి చేరుకొనుంది. అక్కడి నుంచి విశాఖకు తరలించేందుకు ‘ఓపస్’ ఫ్యునరల్ సర్వీసెస్ సంస్థ కుటుంబ సభ్యులతో కలిసి సమన్వయం చేస్తోంది. కాగా, అనారోగ్యంతో అతడు ఈ నెల 4న మృతి చెందాడు.
TG: హైదరాబాద్ బేగంపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. పూజ చేస్తుండగా దీపం చీరకు అంటుకుని రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సజీవదహనమయ్యారు. సోఫా, కర్టెన్‌లకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఆమె అప్పటికే మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: కామారెడ్డి జిల్లా కేంద్రం శ్రీరామ్ నగర్ కాలనీలోదారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వ్యక్తి శ్రవణ్(5) అనే చిన్నారిని హత్యచేశాడు. బాలుడి తల్లి లక్ష్మి భర్తతో విడిపోయి నర్సింహులు అనే వ్యక్తితో సహజీవనంలో ఉంది. ఈ క్రమంలో రాత్రి లక్ష్మి లేనప్పుడు ఆమె ఇంటికి వెళ్లిన నర్సింహులు.. శ్రవణ్ గొంతు నులిమి హత్య చేశాడు. అతనితో పాటు లక్ష్మినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
TG: హైదరాబాద్‌లోని KPHB ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సు నుంచి దింపేశారు. తగలబడుతున్న బస్సులో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో KPHBలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోయంబత్తూర్ జిల్లా పాల్‌పారైలో వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా కేరళకు చెందినవారిగా గుర్తించారు.
ATP: తాడిపత్రి మండలంలోని వీరాపురంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరాన్ని డ్రోన్ కెమెరా సాయంతో పోలీసులు గుర్తించారు. సీఐ శివగంగాధర్ రెడ్డి సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.70,150 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
AP: గుంటూరు జిల్లా తెనాలిలో అర్థనగ్న ఫోన్‌కాల్స్, చాటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్ట్రిప్ టాక్ పేరుతో ఓ యువకుడు ఆన్‌లైన్ పోర్టల్ నిర్వహిస్తున్నాడు. డబ్బులు చెల్లించిన వారితో మహిళలు న్యూడ్ చాటింగ్ చేస్తున్నారు. చెంచుపేటలో ఓ ఇంటి నుంచి వ్యవహారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలతో పోర్టల్ నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
థాయ్‌లాండ్‌లో వారం రోజులపాటు జరుపుకునే సోంగ్‌క్రాన్ వేడుకల్లో 191 మంది మరణించడం తీవ్ర విషాదం నింపింది. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల 951కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా ప్రయాణాల రద్దీ వల్ల ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పండుగ సంతోషం నింపాల్సింది పోయి, ఇలా మారణహోమంగా మారడం కలచివేస్తోంది.