AP: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని దగ్గర దారుణం జరిగింది. యువతిపై ఆటో డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే యువతి శక్తి యాప్‌లో ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను కాపాడారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని.. యువతిని స్వస్థలానికి చేర్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: IPL సీజన్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15 మందిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. లాలాపేటలో 11 మంది, పాత గుంటూరులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. నిందితుల నుంచి మొత్తం రూ.2 లక్షల నగదు, 13 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కర్ణాటకలోని ఓ ఐఫోన్ తయారీ ప్లాంటులో దారుణం చోటుచేసుకుంది. ఆ ప్లాంట్‌లో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతి టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ యువతి పసికందు గొంతుకోసి హతమార్చి ఓ సంచిలో పడేసింది. ఆ యువతికి ఇంకా వివాహం కాలేదని.. ఈ విషయం తెలిస్తే పరువు పొతుందేమోనని భయాందోళనతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ATP: తాడిపత్రి రూరల్ పరిధిలోని పేకాట స్థావరంపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. సీఐ శివగంగాధర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 55,440 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
UP మీర్జాపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది సజీవ దహనమయ్యారు. డ్రమండ్‌గంజ్ ప్రాంతంలో కంకర లోడు లారీ వేగంగా వచ్చి మారుతీ స్విఫ్ట్‌ను ఢీకొనగా.. అది దాని ముందున్న బొలెరోను గుద్దడంతో మంటలు చేలరేగాయి. దీంతో 11 మంది అక్కడికక్కడే మంటల్లో ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
AP: అనంతపురం హనీట్రాప్ ముఠాకు అనుకూలంగా వ్యవహరించారని ఇద్దరు సీఐలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సీఐలు రాజేంద్రనాథ్, శ్రీహర్షను కర్నూలు వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు డీఐజీ వద్ద రిపోర్టు చేయాలని ఇద్దరు సీఐలకు ఆదేశించారు. హనీట్రాప్ ముఠాతో సంబంధాలున్న మరో 10 మందిని శిక్షణ ఎస్పీ అశ్విన్‌కుమార్ విచారిస్తున్నారు.
AP: అనంతపురం హనీట్రాప్ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మహిళలను ఎరగా వేసి కేటుగాళ్లు రూ.లక్షలు దోచుకుంటున్నారు. సంపన్న వర్గాలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా వ్యవహరించిన తీరుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురంలోని పలు స్టేషన్లలో హానీట్రాప్ బాధితులు ఫిర్యాదు చేశారు.
AP: తూర్పుగోదావరి జిల్లా ప్రక్కిలంక SBI బ్రాంచ్‌లో భారీ మోసం చోటుచేసుకుంది. వెంకట నరసింహం అనే వ్యక్తి బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై రూ.6.87 కోట్ల విలువైన 25 ఏబీఎల్ రుణాలు పొందినట్లు అధికారులు గుర్తించారు. 2019 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ మోసం జరిగినట్లు గుర్తించిన అధికారులు CID పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన CID పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంచికచర్ల మండలం పరిటాలలో వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కిడ్నీలు పాడవడంతో వైద్యం చేయించుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
AP: కృష్ణా జిల్లాలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో 10 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి మచిలీపట్నంలో విక్రయించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తల్లి ఆచూకీ గుర్తిస్తామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు.
AP: కాబోయే భర్త వేధింపుతలో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప జిల్లాలో జరిగింది. ఐటీ ఉద్యోగి షాజహాన్ అనే వ్యక్తితో యువతికి నిశ్చితార్థం అయింది. తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, తానంటే ఇష్టం లేదంటూ యువతిని వేధించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలి వద్ద 12 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రియుడిపై ప్రేయసి పెట్రోల్ పోసి చంపిన ఘటన బెంగళూరులో జరిగింది. తనను పట్టించుకోవడం లేదని ప్రియుడిపై కోపం పెంచుకుంది. వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానని నమ్మించి ఇంటికి పిలిచింది. అనంతరం కుర్చీలో కూర్చోబెట్టి చేతులు, కాళ్లు కట్టేసి కళ్లకు గంతలు కట్టి అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
AP: ప.గో(D) నల్లజర్ల మం. అనంతపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపల్లి టోల్‌గేట్ సమీపంలోని సూచిక బోర్డును కారు ఢీకొట్టడంతో అందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను గోపాలరావు పేట ఆస్పత్రికి తరలించారు. ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం నుంచి మార్కాపురం వెళ్తుండగా.. డోర్నాల మండలం చిన్నారుట్ల-తుమ్మలబైలు వద్ద ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: ప.గో. జిల్లా నరసాపురం ఏరియా ఆస్పత్రిలో అరుంధతి అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అద్దె బకాయి అడిగినందుకు అద్దెదారుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చేరిన ఆమె, అక్కడ బాత్‌రూమ్‌లో ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేయకపోగా, ఎదురుగా తన భార్యపైనే దొంగతనం కేసు పెడతామని బెదిరించారని భర్త రాంబాబు ఆరోపిస్తున్నారు.