• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

యువతిగా ఫేక్ IDతో సైబర్ మోసాలు.. అరెస్ట్

AP: యువతిగా ఫేక్ IDతో పరిచయాలు పెంచుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ సైబర్ నేరగాడిని HYD పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన నిందితుడు పెదపూడి ప్రసన్నకుమార్ ఓ మ్యాట్రిమోనియల్ సైట్‌లో అమ్మాయిలా నటిస్తూ పెళ్లి చేసుకుంటానని మోసాలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. క్రిప్టో ఇన్వెస్ట్ మోసాలకూ పాల్పడ్డాడని, 400+ సిమ్ కార్డులతో ఫేక్ అకౌంట్లు తెరిచాడని గుర్తించారు.

February 27, 2026 / 11:40 PM IST

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: నంద్యాల జిల్లా జగదుర్తి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు క్రేన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 02:22 PM IST

కోల్‌కతాలో భారీగా భూప్రకంపనలు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.0గా నమోదైంది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 01:46 PM IST

లాకప్ డెత్.. మృతదేహానికి రీపోస్టుమార్టం

TG: సూర్యాపేట కోదాడలో లాకప్ డెత్ కేసు వెలుగు చూసింది. ఈ క్రమంలో కర్ల రాజేష్ మృతదేహానికి అధికారులు రీపోస్టుమార్టం నిర్వహించారు. జాతీయ కమిషన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో రాజేష్‌పై ఆరోపణలు ఉన్నాయి.

February 27, 2026 / 10:58 AM IST

ప్రేమ వివాహం.. యువకుడి దారుణ హత్య

TG: హైదరాబాద్‌లోని బొమ్మలరామారంలో దారుణ హత్య జరిగింది. అజయ్ అనే యువకుడిపై యువతి బంధువులు కత్తులతో దాడి చేశారు. మూడు రోజుల ముందు అజయ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. మాట్లాడాలని పిలిచి అజయ్‌పై యువతి సోదరుడు దాడికి పాల్పడ్డాడు. కళ్లలో కారం చల్లి 14 సార్లు పొడిచాడు. దీంతో అతని పరిస్థితి విషయంగా ఉండటంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.

February 27, 2026 / 10:34 AM IST

సోమందేపల్లిలో ఉరేసుకుని వ్యక్తి మృతి

సత్యసాయి: సోమందేపల్లి మండలం నక్కలగుట్ట కాలనీలో నివసిస్తున్న వడ్డే మారుతి (36) ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ పోషణలో ఎదురైన సమస్యలు, అప్పుల భారం కారణంగా మనస్తాపానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

February 27, 2026 / 10:00 AM IST

సైబర్ ముఠా అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

TG: రూ.547 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితులను రిమాండ్‌ను తరలించారు. కాగా ఇప్పటికే 14 మంది నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

February 27, 2026 / 08:51 AM IST

దారుణం.. రాష్ట్రంలో మరో పరువు హత్య

AP: తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలో పరువుహత్య జరిగింది. సూర్యప్రకాష్ అనే వ్యక్తిని యువతి సోదరులు కొట్టి చంపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందున కోపంతో చెల్లెలి భర్తను దారుణంగా హతమార్చారు. సూర్యప్రకాష్‌ను రాయవరం డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తున్న అయినవిల్లి సంధ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్ని గంటలకే సంద్య సోదరులు దాడి చేసి హత్య చేశారు.

February 27, 2026 / 08:39 AM IST

హైవేపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ATP: గుత్తి మండలం టీ.కొత్తపల్లి గ్రామ సమీపంలోని 63 హైవేపై శుక్రవారం తెల్లవారుజామున బైకు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈసురాళ్లపల్లి గ్రామానికి చెందిన బెస్త రంగస్వామి, బెస్త పవన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 27, 2026 / 06:30 AM IST

264 మంది పోకిరీల పట్టివేత

TG: షీ టీమ్స్, CC కెమెరాలతో ఎక్కడికక్కడ నిఘా పెట్టినా పోకిరీల తీరు మారట్లేదు. రద్దీ ఎక్కువగా ఉంటే ప్రాంతాల్లో మహిళలు, యువతుల్ని అసభ్యంగా తాకుతూ రాక్షసానందం పొందుతున్నారు. HYD నుమాయిష్‌లో ఇలా చేస్తూ 260 మంది పోకిరీలు చిక్కారు. వీరిలో 22 మంది మైనర్లూ ఉండటం గమనార్హం. 188 పోకిరీలకు కౌన్సిలింగ్ ఇవ్వగా, 52 మందికి జరిమానా.. మరో నలుగురికి 2 రోజుల జైలు+జరిమానా విధించారు.

February 27, 2026 / 02:20 AM IST

హత్య కేసును చేధించిన పోలీసులు

AP: అన్నమయ్య జిల్లా గాలివీడు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 17న జరిగిన రామకృష్ణారెడ్డి హత్య కేసులో మహేశ్వర్ రెడ్డి సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ.10 లక్షలు సుపారీ తీసుకుని రామకృష్ణారెడ్డిని హత్య చేసినట్లు గుర్తించారు. భూతగాదాలే ఈ హత్యకు కారణమని వెల్లడైంది. రామకృష్ణా రెడ్డి భార్య ఫిర్యాదు చేయడంతో.. CC ఫుటేజీ, సాంకేతికత ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు.

February 26, 2026 / 09:11 PM IST

రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని మృతి

AP: బాపట్ల జిల్లా వాడరేవు-పిడుగురాళ్ల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని సహస్ర(20) ప్రాణాలు కోల్పోయింది. స్కూటీపై వెళ్తున్న యువతి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అఖిల్ అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. HYDకి చెందిన సహస్ర గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది.

February 26, 2026 / 05:34 PM IST

రూ.200 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

AP: ఆంధ్ర- ఒడిశా బోర్డర్‌లో భారీగా గంజాయి పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రూ.200 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1800 కేజీల హాష్ ఆయిల్ సీజ్ చేశామన్నారు. హాష్ ఆయిల్‌తో పాటు రూ.5 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

February 26, 2026 / 03:37 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారిలోని భాకరాపేట సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీ కొనడంతో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలై కాలు నుజ్జునుజ్జు అయింది. స్థానికులు హుటాహుటిన 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 12:14 PM IST

BREAKING: భారీ అగ్ని ప్రమాదం

TG: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 36లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మాన్యవర్ బట్టల షోరూమ్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో భవనంలో పనిచేస్తున్న సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 11:41 AM IST