»Project K Movie Kamal Haasan Official Announcement
Project K:లో కమల్..అధికారికంగా ప్రకటన
ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ కె(project k)' ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించనున్నట్లు మేకర్స్ ఈ మేరకు ప్రకటించారు.
ఎట్టకేలకు ఎంతగానో ఎదురుచూస్తున్న న్యూస్ రానే వచ్చింది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణెతో ప్రభాస్(prabhas) నటించిన నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K(project k)లో కమల్ హాసన్(Kamal haasan) విలన్ గా నటించనున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా ప్రాజెక్ట్ కె మేకర్స్ వెల్లడించారు. అతిపెద్ద పాన్-ఇండియన్ స్టార్లలో ఒకరైన కమల్ హాసన్, ప్రభాస్ పెద్ద స్క్రీన్‌పై ఫైట్ చేయడం నిజంగా క్రేజీగా ఉంటుందని చెప్పవచ్చు. తన కెరీర్లో చాలా కాలం పాటు మిస్టర్ కమల్ హాసన్‌తో కలిసి పనిచేయాలని తన కోరిక అని చిత్ర నిర్మాత అశ్వనీదత్ అన్నారు. ఇప్పుడూ ‘ప్రాజెక్ట్ కె’తో ఆ కల సాకారమైందని వెల్లడించారు. దీంతోపాటు మిస్టర్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇద్దరు దిగ్గజ నటులతో కలిసి పని చేయడం ఏ నిర్మాతకైనా గొప్ప క్షణమని పేర్కొన్నారు. తన కెరీర్లో 50వ సంవత్సరంలో ఇది నిజంగా తనకు దక్కిన ఒక వరమని అన్నారు.
నాగ్ అశ్విన్(nag ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దాదాపు 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ల షూటింగ్ పూర్తి కావడానికి ఇంకొన్ని వారాల సమయం ఉంది. గతంలో విక్రమ్ స్టార్ కమల్ హాసన్ ప్రభాస్ ప్రాజెక్ట్ కెలో విలన్ పాత్రలో నటించడానికి రూ.150 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఇక ప్రధాన నటుడిగా ఈ సినిమాకు ప్రభాస్ తీసుకుంటున్న పారితోషికం కంటే ఇది రెట్టింపు అని అంటున్నారు. కమల్ హాసన్ ఎంట్రీతో ఈ మూవీ ఇంకా నెక్ట్స్ లెవల్ వెళుతుందని సినీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రానుంది.