నంద్యాల: బేతంచెర్లలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు ఈ నెల 17న ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని షాది ఖానాలో సాయంత్రం 7 గంటలకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ముస్లింలు పాల్గొని ఇఫ్తార్ విందును స్వీకరించాలని కోరారు.