MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ నోటీసులకు ఆమె స్పందించారు. రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ నోటీసులకు ఆమె స్పందించారు. రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత జాగృతి ఈనెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టిందని తెలిపారు. ఈ క్రమంలోనే 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ తనకు నోటీసులు జారీ చేసిందన్నారు.
చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని తెలిపారు కవిత. కానీ, ధర్నా, ముందస్తు అపాయింట్ మెంట్స్ రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని చెప్పారు.
ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని తెలుసుకోవాలని మండిపడ్డారు కవిత. కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. దేశ అభ్యున్నతి కోసం నిరంతరం గొంతెత్తుతూనే ఉంటామని చెప్పారు.
ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదన్నారు కవిత. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామని.. ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షాపరులకు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నానని స్పష్టం చేశారు.