ఎన్టీఆర్ తాజా చిత్రం “దేవర ” భారీ ఆశలతో విడుదలయ్యింది. ఈ సినిమా ఫస్ట్ డే నుంచే మంచి టాక్ తో బాక్స్ ఆఫీస్ లో సత్తా చాటింది. మొదటి రోజు 173 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. రెండవ రోజు, కలెక్షన్స్ 243 కోట్లకు చేరుకుని, మొత్తం మూడు రోజుల చివరికి 304 కోట్ల వరకూ చేరింది. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.
“దేవర” తొలి రోజున కొంత మిశ్రమ స్పందన పొందినప్పటికీ, మధ్యాహ్నం షోల అనంతరం ప్రేక్షకులలో పాజిటివ్ టాక్ ఏర్పడింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన అనిరుధ్, ఈ చిత్రానికి ఒక పెద్ద ప్లస్ అయ్యాడు. సాంగ్స్ తో పాటు, రేరేకార్డింగ్ కూడా అనిరుధ్ కుమ్మేసాడు. దర్శకుడు కొరటాల శివ తన కం బ్యాక్ విజయాన్ని రాబట్టడంతో సంతోషంగా ఉన్నారు.
ఎన్టీఆర్ అమెరికాలో ఉన్నారు, ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. దేవర బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసి, ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తోంది. ప్రస్తుతం దేశమంతటా ట్రెండింగ్ సినిమాగా దేవర నిలిచింది.