»Cm Jagan Drinks Blood Of People Chandrababu Naidu
Chandrababu Naidu: వివేకా కేసులో అలా దొరికిపోతానని జగన్ ఊహించలేదు
తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో టెక్నాలజీతో దొరికిపోతానని ముఖ్యమంత్రి (chief minister of andhra pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) అసలు ఊహించి ఉండరని మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు.
తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో టెక్నాలజీతో దొరికిపోతానని ముఖ్యమంత్రి (chief minister of andhra pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) అసలు ఊహించి ఉండరని మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ (kanna laxminarayana) పార్టీలో చేరిన సమయంలో అధినేత మాట్లాడారు. బాబాయ్ ని అబ్బాయే చంపేశాడని తేలిపోయిందని ఆరోపించారు. గూగుల్ టెకౌట్ (google takeout) వంటి సాంకతిక పరిజ్ఞానం (Technology) వస్తుందని, తాను ఈ కేసులో ఇరుక్కుంటానని జగన్ భావించి ఉండరని, కుట్రదారులు అందరూ వివేకా హత్యకు ముందు ఎంపీ అవినాశ్ రెడ్డి (kadapa mp avinash reddy) ఇంట్లోనే ఉన్నారని, హత్య తర్వాత కూడా ఆయన ఇంటికే వెళ్లారన్నారు. అవినాశ్ రెడ్డి కూడా అక్కడి నుండి ఫోన్లు చేసింది లోటస్ పాండులోని (lotus pond) జగన్ ఇంటికేనని గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించినట్లు సీబీఐ (CBI) తన అఫిడవిట్ లో (CBI affidavit) పేర్కొన్నదని తెలిపారు. బాబాయ్ హత్యపై కోడికత్తి కమల్ హాసన్ ఎన్ని డ్రామాలు ఆడారు అని జగన్ ను ఉద్దేశించి అన్నారు. సినిమా వాళ్లు కూడా ఇలాంటి కథను ఎప్పుడూ ఊహించి ఉండరని, హత్య తర్వాత గుండెపోటు నాటకం ఆడారని విమర్శించారు. వివేకా గుండెపోటుతో రక్తం కక్కుకొని చనిపోయాడని నమ్మబలికితే ప్రజలు ఏం తెలియక ఒక నరహంతకుడికి ఓటు వేశారన్నారు.
వివేకా హత్యపై మొదట సీబీఐ దర్యాఫ్తు డిమాండ్ చేసిన జగన్, ఆ నేరాన్ని ఇతరుల పైకి నెట్టే ప్రయత్నాలు కూడా చేశారని, ఆ తర్వాత సాక్షి పత్రికలో నారాసుర రక్త చరిత్ర అంటూ కథనం వండి వార్చారు అన్నారు. వైయస్ వివేకా వల్ల ఈ రోజు జగన్ అధికారంలో ఉన్నాడని ధ్వజమెత్తారు. షర్మిలకు (Sharmila) కడప లోకసభ (Kadapa Lok Sabha) టిక్కెట్ ఇవ్వాలని, అవినాష్ రెడ్డికి జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని వివేకా అడ్డుపడటంతో ఈ హత్య జరిగిందని ఆరోపించారు. వాళ్లు ఎంతటి దుర్మార్గులో ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. వివేకా హత్య కేసులో ఇప్పటికే ముగ్గురు, నలుగురు చనిపోయారని, పరిటాల రవి హత్య కేసులో మొద్దు శీను సహా ఐదారుగురు ఎగిరిపోయారని, పులివెందుల సింగిల్ విండో ఎన్నికల్లో వైసీపీ రిగ్గింగ్ చేస్తే టీడీపీ ఇంచార్జ్ సతీష్ రెడ్డి అక్కడకు వెళ్లాడని, ఆ సమయంలో ఆత్మరక్షణ కోసం గన్ మెన్ కాల్పులు జరిపితే ఒకరు చనిపోయారని, సతీష్ రెడ్డి కాల్చారని తప్పుగా కేసు నమోదు చేశారని మండిపడ్డారు. గన్నవరం ఘటనలో పట్టాభి సహా టీడీపీ నేతలపై కేసులు అక్రమం అన్నారు. సీఐ కనకారావుతో ఫిర్యాదు చేయించి, అట్రాసిటీ కేసు పెట్టారని, కానీ ఆయన కుటుంబ సభ్యులు కనకారావును జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. వివేకా కేసులోకి సీబీఐ రాకపోతే సునీల్ యాదవ్ వంటి వారు కూడా ఎగిరిపోయేవారన్నారు. గన్నవరంలో టీడీపీ బీసీ నేత దొంతు చిన్నాపై వైసీపీ దాడి చేసిందని, అంతకుముందు రఘురామకృష్ణంరాజును చిత్రహింసలు పెట్టారన్నారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విషయంలోను ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందన్నారు. జనసేన సభకు స్థలం ఇచ్చారని ఇప్పటంలో రోడ్లు వేస్తామంటూ ఇళ్లు కూల్చడం విడ్డూరంగా ఉందన్నారు. మేం అధికారంలోకి వచ్చాక తాడేపల్లి ప్యాలెస్ మీదుగా రోడ్డేస్తాం… ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. జగన్ అసమర్థ పాలనలో ఒడిశా కంటే వెనుకబడ్డామన్నారు. రాష్ట్రంలో ఎవరైనా వ్యాపారాలు చేస్తుంటే మెడపై కత్తి పెట్టి ఆస్తులు రాయించుకున్న ఉగ్రవాది జగన్ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోర్టులు వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లడం, భూములు కొట్టేయడం, పరిశ్రమలు తరలిపోవడం.. వీటి వెనుక భయంకరమైన కథలు ఉన్నాయన్నారు.