»Cannes 2023 Urvashi Rautela Reminds Of Aishwarya Rai As The Sports Blue Lips In Second Red Carpet Appearance
Aishwarya Rai:ని కాపీ చేసిన ఊర్వశి రౌతెలా..!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా(Urvashi Rautela) ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చేయడంలో ముందుంటారు. ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. రెడ్ కార్పెట్ పై హోయలు ఒలికించింది. అయితే.. తొలిసారి పింక్ గౌను లో దర్శనమిచ్చి, మెడలో బల్లి నక్లెస్ తో భయపెట్లిన ఆమె, రెండోరోజు ఐశ్వర్యారాయ్(Aishwarya Rai)ని కాపీ చేసింది.
గురువారం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై రెండవసారి కనిపించి ఊర్వశి రౌతెలా(Urvashi Rautela) అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి, ఆమె తన క్రీమ్ నీలిరంగు గౌనుకి స్కేల్స్‌తో సరిపోయేలా బ్లూ కలర్ లిప్ స్టిక్ ని ధరించింది. గతంలో లావెండర్ గౌనులో కార్పెట్‌పై నడిచిన ఐశ్వర్య కూడా బ్లూ కలర్ లిప్ స్టిక్ ధరించారు.
తాజాగా ఊర్వశి, ఐశ్వర్య(Aishwarya Rai)ని కాపీ చేస్తూ, అలాంటి లిప్ స్టిక్ ధరించడం విశేషం. దీంతో ఐశ్వర్యను కాపీ చేశావ్ అంటూ నెటిజన్లు ఆమెను కామెంట్ చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఊర్వశి లుక్ మాత్రం అదిరిపోయింది.
ఆఫ్-షోల్డర్ క్రీమ్, బ్లూ గౌనుతో పాటు భారీ డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు కూడా ధరించింది. హెయిర్ బన్ పెట్టి, చేతికి బ్రేస్ లెట్ ధరించింది. ఇక మొదటి రోజు ఆమె ధరించిన డ్రెస్, జ్యువెలరీ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. పింక్ డ్రెస్ లో ఆమె మెరిసింది. ఈ డ్రెస్సు చాలా మందికి నచ్చినా.. మెడలో ఆమె ధరించిన బల్లి నెక్లెస్ మాత్రం భయపెట్టింది.
ఈ బంగారు బల్లి నెక్లెస్ కెమెరాలను విపరీతంగా ఆకర్షించింది. ఈ బల్లి నెక్లెస్ కు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఊర్వశి ధరించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 76వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ ఓపెనింగ్ అనే క్యాప్షన్ తో వాటిని అభిమానులతో పంచుకుంది.