ADB: ఆదిలాబాద్‌లోని రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు ఆలస్యం కావడం వల్ల వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని పనుల వేగాన్ని పెంచాలని సంబంధిత అధికారులను కోరారు. పనులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చూస్తామని ఆయన వివరించారు.