E.G: బిక్కవోలు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరా ఏర్పడుతుందని ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నటరాజన్ తెలిపారు. పందలపాక సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతులు చేపడుతున్న నేపద్యంలో బుధవారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొంకుదురు, పందలపాక, మేళ్లూరు తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.