NZB: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా NZB రైల్వే స్టేషన్లో RPF ఆధ్వర్యంలో ఆదివారం ‘మహిళలకు సురక్షిత ప్రయాణం’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారం రోజుల పాటు సాగే ఈ ప్రచారంలో భాగంగా స్టేషన్లో ర్యాలీ నిర్వహించి, మహిళా ప్రయాణికులకు గులాబీ పూలు ఇచ్చి గౌరవించారు. మహిళల భద్రత, వేధింపుల నిరోధంపై ప్రయాణికులకు, టాక్సీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు.