TSPSC పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay)కు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆదివారం హాజరు కావాలని సిట్(SIT) తెలిపింది. కానీ ఈరోజు సిట్ విచారణకు బండి సంజయ్ దూరం కానున్నారు. బండి సంజయ్ తరఫున సిట్ ముందుకు బీజేపీ(BJP) లీగల్ టీమ్ రానుంది.
TSPSC కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. పేపర్ లీకేజీ కేసులో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay)కు సిట్(SIT) ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆదివారం తమ ఎదుట హాజరుకావాలని తెలిపింది. పేపర్ లీక్ కుంభకోణంలో వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని, ఆధారాలు సమర్పించాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈరోజు సిట్ విచారణకు బండి సంజయ్ దూరం కానున్నారు. బండి సంజయ్ తరఫున సిట్ ముందుకు బీజేపీ(BJP) లీగల్ టీమ్ రానుంది. బండి సంజయ్ నేడు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్రమంత్రి అమిత్ షాతో కలిసి బీదర్ సభలో పాల్గొనాల్సి ఉంది.
TSPSC పేపర్ లీకేజీ కేసులో నిరాధార ఆరోపణలు చేసినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంగళవారం సిట్(SIT) నోటీసులు జారీ చేసింది. ఆయన ఇంట్లో లేకపోవడంతో అతని నివాసానికి నోటీసులు అతికించారు. జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికి పైగా గ్రూప్-1లో అర్హత సాధించారు. వీరిలో బీఆర్ఎస్ నాయకుల కుమారులు, నలుగురు సర్పంచ్ల కుమారులు, సింగిల్ విండో చైర్మన్ కుమారుడు, జడ్పీటీసీ అంగరక్షకుడి కుమారుడు ఉన్నారని సంజయ్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కొడుకు అర్హత సాధించాడని చెప్పారు. ఈ క్రమంలో ఆరోపణలకు సంబంధించి సిట్(SIT) కు ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది. సిట్‌కు పూర్తి సమాచారం ఇవ్వాలని, విచారణకు సహకరించాలని 24వ తేదీ ఉదయం 11 గంటలకు హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయంలో హాజరు కావాలని బండికి సూచించారు. అయితే విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ఆ తర్వాత శుక్రవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా అప్పుడు కూడా గైర్హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల కారణంగా ఢిల్లీలో ఉన్నానని, సమావేశాలకు హాజరు కాలేనని బండి సంజయ్ సిట్ కు లేఖ రాశారు.
ప్రస్తుతం TSPSC పేపర్ లీక్ కేసులో నలుగురు నిందితులకు పోలీసులు(police) కస్టడీ విధించారు. నిందితులకు ఈరోజు నుంచి మూడు రోజుల పాటు సిట్ కస్టడీ అమలు కానుంది. ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, ఢాక్యా, కేతావత్ రాజేశ్వర్ లను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు సిట్ కు అనుమతించింది. పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు మొత్తం 13 మందిని సిట్ అరెస్ట్ చేసింది.