HNK: కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘కెమికల్ సైన్సెస్ ప్రస్తుత పరిశోధనలు (CRCS-2026)’ అనే అంశంపై నేటి నుంచి 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. వర్సిటీ పరిపాలన భవనంలోని సెనేట్ హాల్లో జరిగే ఈ కార్యక్రమానికి వీసీ ప్రతాప్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. IICT (HYD) చీఫ్ సైంటిస్ట్ గంగాగ్నిరావు కీలకోపన్యాసం చేస్తారు.