మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతారిపల్లిలో సర్పంచ్ మద్దూరి సునీల్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. ఈ సభలో గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలను సేకరించారు. అనంతరం గ్రామంలో కొత్తగా CC రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పాలక వర్గం మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.