JGL: జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి నివాసానికి మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంలో మంత్రులు జీవన్‌రెడ్డికి పార్టీ మారవద్దని సూచించారు. ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. సమస్యలు ఉన్నట్లయితే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.