RR: చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల వేలాన్ని రేపు నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు రేపు ఉదయం 10:30 గంటలకు చేవెళ్ల ఎక్సైజ్ కార్యాలయ ప్రాంగణంలో ఈ వేలాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.