KNR: జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 4 దరఖాస్తులు స్వీకరించినట్లు తహసీల్దార్ వెంకటరెడ్డి తెలిపారు. 4 దరఖాస్తులు భూమి సమస్యకు సంబంధించినవిగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.