KMM: మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రవాణాశాఖ నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆయన పరిశీలిస్తారు. జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, రోడ్డు భద్రతా ప్రమాణాల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు.