NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని అంగన్వాడీ కేంద్రాల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని ఛైర్పర్సన్ బృంగి రత్నమాల హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో ఆమెను, వైస్ ఛైర్మన్ శానవాజ్ ఖాన్ను అంగన్వాడీ సిబ్బంది సన్మానించారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.