TG: భద్రాచలం సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయం రూ.1,56,91,971 వచ్చినట్లు ఈవో దామోదర్ రావు తెలిపారు. నెల రోజులకుగానూ 71 గ్రాముల బంగారం, కిలో 280 గ్రాముల వెండితో పాటు 34 యూఎస్ డాలర్లు, ఒక కెనడా డాలర్, 196 మలేషియా రింగిట్స్, 100 యూఏఈ దీరామ్స్, 27 సింగపూర్ డాలర్లు, 80 ఇంగ్లాండ్ స్టిర్లింగ్స్, 50 సౌదీ అరేబియా రియాల్స్, 50 ఆస్ట్రేలియా డాలర్లు వచ్చాయని వెల్లడించారు.