TG: ములుగు జిల్లా కర్రెగుట్టల్లో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జవానుకు తీవ్రగాయాలయ్యాయి. వెంకటాపురం మండలం పామునూరు సమీప కర్రెగుట్టల్లో పేలుడు జరిగింది. హెలికాప్టర్లో జవానును పోలీసులు వెంకటాపురం తరలించారు. వెంకటాపురం నుంచి వరంగల్ వైద్
AKP: ఈనెల 22న విశాఖలో జరిగే సాగర సంగ్రామ దీక్షను జయప్రదం చేయాలని పీఆర్డీయూ జిల్లా అధ్యక్షులు డీ. గోపినాధ్ తెలిపారు. శుక్రవారం ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. సీపీఎస్ ఉద్యోగుల హక్కుల సాధన కొరకు ఏపీసీపీఎస్ఈఏ ఈ సాగర సంగ్రామ దీక్ష కార్యక్రమా
KMR: ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని బస్తీ దవాఖానలు, రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం అమలుపై జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నర్సింగ్ శుక్రవారం సమీక్షించారు. బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పాఠశాల విద్యార్
SRPT: చివ్వెంల మండలం కూడకుడకు చెందిన పట్టేటి స్పందనపై హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడు బోయిండ్ల మహేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి బావ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్స మహేశ్వర్ గురువారం సాయంత్రం నిందితుడిని అద
మహబూబాబాద్ మండలం సండ్రాలగూడెం శివారు పూరి తండాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి బానోత్ లక్ష్మి (55) అనే గిరిజన మహిళా రైతు అక్కడికక్క
NTR: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నిత్య అన్నదాన పథకం కోసం గుంటూరు జిల్లా రాజేంద్రనగర్ వాస్తవ్యులు శ్రీ ముప్పవరపు రమేష్ కుమార్, శ్రీమతి మాధవి లత దంపతులు విరాళం అందజేశారు. ఈ మేరకు వారు తమ కుమారుడు UASలో నివసిస్తున్న శ్ర
చంద్రుని ఉపరితలంపై శాస్త్రవేత్తలు తాజాగా 1,114 కొత్త పగుళ్లను గుర్తించారు. దీంతో మొత్తం పగుళ్ల సంఖ్య 2,634కి చేరింది. చంద్రుని అంతర్భాగం చల్లబడుతుండటంతో అది కుచించుకుపోతోందని, ఆ ఒత్తిడి వల్లే పగుళ్లు ఏర్పడుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ మ
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,56,497 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 323 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 15 ద్విచక్ర వాహనాలకు ప
ATP: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు నియామకాలకు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రతాప్ రెడ్డి కోరారు. ఇంటర్మీడియట్ గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులలో 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. మార్చి 9- 12 వరకు agnipathvay
GDWL: గద్వాల మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ నూతన మున్సిపల్ ఛైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణ సమగ్ర అభివృద్ధికి చిత్తశుద