కృష్ణా: యనమలకుదురు శివాలయంలో జరిగిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం సోమవారం ఆలయంలో విచారణ కొనసాగుతోంది. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆలయ కానుకలను మాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవో భవానిపై శాఖాపరమైన చ
SRPT: నడిగూడెం సిరిపురం క్లస్టర్ పరిధిలోని రైతులు రైతు భరోసా కోసం మంగళవారంలోగా దరఖాస్తు చేసుకోవాలని ఏఈఓ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా పాసుబుక్కులు పొందిన వారు, గతంలో దరఖాస్తు చేయని వారు ఈ అవకాశం వాడుకోవాలన్నారు. పాసుబుక్కు ఆధార్క
KNR: కరీంనగర్ సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తిరుమల నగర్లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహిస్తున్న ఇంగ్లీష్ పరీక్షల సరళిన
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అబిడ్స్ సెంటర్లోని శ్రీ నూకాలమ్మ దేవస్థానం ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో రెండు లక్షల 75 వేల 978 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ కొరుప్రోలు శ్రీనివాసరావు తెలిపా
TPT: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 10వ తరగతి గణితం పరీక్ష జరిగింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 27,590 మంది విద్యార్థులకు గాను 27,385 మంది హాజరుకాగా 205 గైర్హాజరైనట్లు వివరించారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 903 మందికి గాను 802 హాజరై 101 మంది
TG: అప్పులు తగ్గించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని BRS ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి అన్నారు. కానీ రుణం చెల్లించాల్సిన కాల పరిమితిని 22 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచిందని విమర్శించారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు.
తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు కర్చీఫ్ అడ్డుపెట్టుకోవడం సామాజిక బాధ్యత. ఇది ఇతరులకు ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. ముఖం తుడుచుకోవడానికే కాక, అలంకారానికి కూడా ఇది కీలకం. వ్యక్తిగత పరిశుభ్రత కోసం కర్చీఫ్ తప్పనిసరిగా వాడాలి. తరచుగా ఉతకాలి.
NRPT: ప్రజలు అందించే ఫిర్యాదులు పరిశీలించి వెంటనే చట్ట ప్రకారం పరిష్కరించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. సోమవారం NRPT ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ స
సాధారణ పెట్రోల్ కంటే పవర్ పెట్రోల్లో ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంజిన్ శబ్దాలను తగ్గించి లోపల శుభ్రంగా ఉంచుతుంది. సాధారణ బైకులు, కార్లకు మామూలు పెట్రోల్ సరిపోతుంది. కానీ ఖరీదైన, ఎక్కువ సామర్థ్యం గల వాహనాలకు పవర్ పెట్రోల్ వాడటమే
ADB: ఆదివాసీల ఆరాధ్య దైవం రాజ్ గోండ్ అని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. ఎప్రిల్ 9న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాజ్ గోండ్ 168వ వర్ధంతి కార్యక్రమం గోడ ప్రతులను ఆదిలాబాద్లో సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్, నైజాం పాల