AP: కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయనను కలిసి ప్రాజెక్టు పురోగతిని వివరించారు. కేంద్ర సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పెండింగ్ డిజైన్లకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని మంత్రి కోరారు.