KNR: కరీంనగర్ సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తిరుమల నగర్లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహిస్తున్న ఇంగ్లీష్ పరీక్షల సరళిని పరిశీలించారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులు సిబ్బందితో మాట్లాడారు. ఈ మేరకు విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు.