MBNR: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్లలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ ప్రజలను నిరాశపరిచిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుకు ఎదురుచూసిన రైతులు, మహిళలకు బడ్జెట్లో “గుండు సున్నా” మాత్రమే మిగిలిందని ఆయన ఎద్దేవా చేశారు. పండుగకాలంలో ప్రజలకు మేలు అందుతుందని ఆశించినవారిని ప్రభుత్వం వంచిందని తీవ్రంగా మండిపడ్డారు.