SRPT: మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ జూనైద్ కుటుంబానికి జిల్లా ఎస్పీ కె. నరసింహ రూ. 2 లక్షల ‘పోలీసు చేయూత’ చెక్కును అందజేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సిబ్బంది విరాళాలతో బాధితులను ఆదుకోవడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సంక్షేమ సంఘం ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.