MDK: మున్సిపల్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తూ 2వ పీఆర్సీలో కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఛైర్ పర్సన్ రజిని రాఘవేందర్ గౌడ్‌కు వినతి పత్రం అందజేశారు. వివిధ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు డీఏ అమలు చేయాలని డిమాండ్ చేశారు.