రాజ్యాంగం ప్రకారం 10 ఏళ్లకోసారి డీలిమిటేషన్ (జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో సీట్ల పెంపు, నియోజకవర్గాల సరిహద్దుల సర్దుబాటు) చేపట్టాలి. 1952, 1963, 1973లో చేపట్టారు. ఆ తర్వాత జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలకు నష్టం జరగొద్దని 25 ఏళ్లు నిలిపివేశారు. ఆ తర్వాత అవే పరిస్థితులు ఉండటంతో మరో 25 ఏళ్లు పొడిగించారు. 2002లో చేపట్టినా సీట్ల సంఖ్య పెంచకుండా నియోజకవర్గ పరిధులను మార్చారు.