• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘హోమియో వైద్యం సురక్షితమైనది’

ATP: గుత్తిలోని వీరారెడ్డి కాలనీలో ఇవాళ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ హోమియో డాక్టర్ ఝాన్సీ లక్ష్మి,హాజరయ్యారు. హోమియోపతి వైద్య విధాన పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ సామ్యూల్ హానిమన్ చిత్రపటానికి నివాళులర్పించారు.హోమియోపతి వైద్యం సురక్షితమైనదన్నారు.

April 10, 2026 / 04:40 PM IST

ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వార్డు పర్యటన

GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వార్డు పర్యటన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంగడిగుంట, కబాడీగూడెం ప్రాంతాల్లో పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

April 10, 2026 / 04:39 PM IST

‘ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడమే లక్ష్యం’

KRNL: పుడమిలోని ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేద్దామని ఇరిగేషన్ శాఖ జేఈ సంజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దకడబూరు మండలం హెచ్ మురవణి, దొడ్డిమేకల, గంగులపాడులలో నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని 90 రోజుల పాటు నిర్వహిస్తుందన్నారు.

April 10, 2026 / 04:38 PM IST

రహదారి కోసం ఎమ్మెల్యేకి రైతుల వినతి

W.G: తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్‌ని నందమూరు గ్రామ రైతులు శుక్రవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసారు. ఆరుళ్ళ బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు కొత్తగా వేయడం వలన ఎర్రకాలవ అవతల పొలాలకు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉందనీ రైతులు వివరించారు. వెంటనే స్పందించిన ఆయన ఆర్‌అండ్‌బి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

April 10, 2026 / 04:37 PM IST

జీఎస్టీ చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

పల్నాడు జిల్లా నరసరావుపేటలో జీఎస్టీ చట్టం అమలుపై అధికారులతో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా ప్రతి దుకాణాలకు జీఎస్టీ అవగాహన కల్పించిన బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. జీఎస్టీ వసూళ్లు పెంచడంలో శాఖల సమన్వయం కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు.

April 10, 2026 / 04:34 PM IST

మాచాపురంలో నీటి సమస్యకు పరిష్కారం

KRNL: నందవరం మం. మాచాపురం గ్రామంలో నెలకొన్న తాగునీటి కొరతపై స్పందించిన వైసీపీ పార్టీ నాయకులు తక్షణ చర్యలు చేపట్టారు. సమస్యను మాజీ MP బుట్టా రేణుక దృష్టికి తీసుకెళ్లగా.. తక్షణమే స్పందించిన ఆమె ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ గ్రామంలో బోర్ వేయించి నీటి సమస్యను కొంతవరకు పరిష్కరించారు. దీంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

April 10, 2026 / 04:29 PM IST

మోగులూరులో ప్రజాదర్బార్ కార్యక్రమం

NTR: కంచికచర్ల మండలం మోగులూరులో ప్రజాదర్బార్ కార్యక్రమం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎండాకాలంలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

April 10, 2026 / 04:29 PM IST

వైసీపీకి షాక్.. TDPలో చేరికలు

NDL: బేతంచర్ల మండల అధ్యక్షుడు ఎల్ల నాగయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఎంబాయి గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ముగ్ధులై వారు పార్టీలో చేరారన్నారు.

April 10, 2026 / 04:27 PM IST

CMRF చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు మండలంలోని మద్దూరు, మద్దూరులంక, వాడపల్లి, కుమారదేవం, పెనకనమెట్ట, చీడిపి, వేములురు గ్రామాలకు చెందిన 10 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేశారు. మొత్తం రూ.5,53,383 విలువైన చెక్కులను పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 10, 2026 / 04:25 PM IST

పిఠాపురంలో మే 1 నుంచి జనగణన

KKD: పిఠాపురం మండలంలో మే ఒకటో తేదీ నుంచి జనగణన ప్రారంభం కానుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బందికి మూడు బ్యాచ్లుగా శిక్షణ ఇచ్చారు. ఈసారి ప్రత్యేక యాప్ ద్వారా వివరాలు సేకరించాలని, ఎన్యుమరేటర్లు ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని సూచించారు. సిబ్బంది సందేహాలను నివృత్తి చేయాలన్నారు.

April 10, 2026 / 04:24 PM IST

ఇళ్ల కూల్చివేతపై సీపీఐ వినతి పత్రం

గుంటూరు నగరంలోని మోతీలాల్ నగర్ జీరో లైన్‌లో ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే 60 ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఇళ్లు కూల్చొద్దని సీపీఐ నాయకులు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవకు వినతిపత్రం అందించారు. జంగాల అజయ్, కోటా మాలాద్రి తదితరులు పాల్గొని బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

April 10, 2026 / 04:21 PM IST

విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దు: MPDO

ELR: పోలవరం మండలం బోడిగూడెంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలను MPDO శ్రీనివాస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందుతున్న భోజన నాణ్యత, తాగునీటి వసతి, వసతి గృహ సౌకర్యాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు సక్రమంగా అందేలా చూడాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని అధికారులను ఆదేశించారు.

April 10, 2026 / 04:21 PM IST

ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు: డాక్టర్ శ్యామ్

ELR: జీలుగుమిల్లి మండలంలోని దర్భగూడెం పాఠశాలలో హోమియోపతి వైద్యుడు డాక్టర్ శ్యామ్ విద్యార్థులకు సన్ స్ట్రోక్ పై అవగాహన కల్పించారు. వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కువగా నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు ఉండకూడదని సూచించారు. తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు.

April 10, 2026 / 04:21 PM IST

రక్త దానం.. సెంచరీకి చేరువలో..!

VZM: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి అత్యవసరంగా ‘O పాజిటివ్’ రక్తం కావాలని తెలుసుకున్న ప్రముఖ కళాకారుడు అనిల్ తెలికిచెర్ల తక్షణమే స్పందించారు. అర్ధరాత్రి సమయమైనప్పటికీ లెక్కచేయకుండా స్థానిక NVN బ్లడ్ బ్యాంక్‌కు చేరుకుని ఆయన రక్తదానం చేశారు. అనిల్‌కు ఇది 99వ రక్తదానం కావడం విశేషం. ఈ సందర్బంగా పలువురు ఆయనను అభినందించారు.

April 10, 2026 / 04:20 PM IST

చంద్రంపాలెం దుర్గాలమ్మకు ప్రత్యేక పూజలు

VSP: మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఉదయం కుంకుమార్చన, పుష్పార్చన, అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దాతల సహకారంతో సుమారు 350 మంది భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

April 10, 2026 / 04:20 PM IST