Vijaya Sai Reddy: వైయస్సార్ భరోసా లేకుండా… పీఎం-కిసాన్‌పై ఆసక్తికర ట్వీట్
ప్రధాని (prime minister of india) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ (PM Kisan) స్కీమ్ కింద భారత ప్రభుత్వం రూ.16,800 కోట్లను విడుదల చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి (Vijaya Sai Reddy) సోషల్ మీడియా (Social Media) అనుసంధాన వేదిక ట్విట్టర్ (Twitter)లో కొనియాడారు.
ప్రధాని (prime minister of india) నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ (PM Kisan) స్కీమ్ కింద భారత ప్రభుత్వం రూ.16,800 కోట్లను విడుదల చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి (Vijaya Sai Reddy) సోషల్ మీడియా (Social Media) అనుసంధాన వేదిక ట్విట్టర్ (Twitter)లో కొనియాడారు. పీఎం కిసాన్ పైన ఆయన చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం (central government) ఈ పథకం కింద ఏడాదికి రూ.6000 మొత్తాన్ని రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తోంది. మూడు విడతల్లో రూ.2000 చొప్పున పై మొత్తాన్ని ఇస్తోంది. ఈ మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం రూ.7500 కలిపి అందిస్తోంది. దీనిని వైయస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ గా (ysr rythu bharosa pm kisan) ప్రచారం చేస్తోంది. ఏపీ సీఎం (Chief Minister of Andhra Pradesh) వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ఈ నిధులను మంగళవారం విడుదల చేశారు. ఈ సమయంలో విజయ సాయి రెడ్డి ట్వీట్ ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పథకం కింద ఎనిమిది కోట్లకు పైగా రైతులు ఏడాదికి రూ.6000 అందుకుంటున్నారని తెలిపారు. పీఎం కిసాన్ పేరును ప్రస్తావించిన విజయసాయి వైయస్సార్ రైతు భరోసాను పేర్కొనలేదు.
అయితే ఆ తర్వాత పలు ట్వీట్ లలో (twitter) తమ వైసీపీ ప్రభుత్వాన్ని (YSRCP Government) ప్రశంసించారు. ‘సిఎం జగన్ (YS Jagan) గారి చొరవతో గుంటూరు-బీబీనగర్ (Guntur – Bibi Nagar) మధ్య 250 కి.మీ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2,853 కోట్ల ఈ ప్రాజెక్టు వలన అపార సున్నపురాయి నిల్వలు ఉన్న పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.’ అంటూ ఆ తర్వాత ట్వీట్ చేశారు.
‘ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలతో పోటీపడి…ఏపీ సీడ్స్ ‘గవర్నెన్స్ నౌ’ జాతీయ అవార్డును వరసగా రెండో ఏడాది గెలుచుకోవడం అభినందనీయం. విత్తనం నుంచి పంట విక్రయం వరకు…అన్నదాతలకు అండగా ఉంటోంది జగన్ గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.’ అంటూ మరో ట్వీట్ చేశారు.
నిన్న వందే భారత్ రైలుపై (vande bharat express) దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు. ప్రజా ధనాన్ని ఇలా ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నించారు. వందే భారత్ వంటివి భారత్ ఎలా ముందుకు వెళ్తుందో నిదర్శనమని చెప్పారు. రాళ్ల దాడి చేసే వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, విజయసాయి రెడ్డి నిన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని (Nitin Gadkari) కలిశారు. ఈ సందర్భంగా వైజాగ్ పోర్ట్ కంటైనర్ టెర్మినల్ ను నేషనల్ హైవే 16తో కనెక్ట్ చేసే భోగాపురం సిక్స్ లేన్ కోస్టల్ హైవే డెవలప్ మెంట్ పైన చర్చించారు. ఈ లైన్ రిషికొండ, బీమిలి మీదుగా వెళ్తుంది.