KKD: జిల్లాలో పెద్దపులి అటవీ అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది. శంఖవరం మండలం తాళ్లపాలెంలో పులిని పట్టుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ పులి ఇవాళ ఉదయం వెంకటాపురం వైపు వెళ్తుండగా స్థానికులు చూసి అధికారులకు సమాచారం అందించారు. వెంకటాపురం నుంచి ఎటు వెళ్తుందా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.