KNR: విద్యార్థుల మానసిక, శారీరక ఎదుగుదలే లక్ష్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ‘హ్యాపీ సండే’ నిర్వహించారు. ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కరీంనగర్లో మల్టీపర్పస్ గ్రౌండ్లో జరిగిన ఈ వేడుకల్లో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఎంఏ అధికారి షాహిద్ మసూద్ పాల్గొన్నారు. విద్యార్థులకు యోగా, జింబాబ్వే డ్యాన్స్, ‘స్వచ్ఛ భారత్’ అంశంపై చిత్రలేఖన పోటీలు ఏర్పాటు చేశారు.