»Victory Of Five Ycp Candidates As Mlcs Marri Rajasekhar As Mlc
AP MLC Election : ఎమ్మెల్సీలుగా ఐదుగురు వైసీపీ అభ్యర్థుల విజయం…ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉన్న వైసీపీకి టీడీపీ షాకిచ్చింది. ఒక స్థానాన్ని టీడీపీ (TDP) కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ(Panchumurti Anuradha) తనకు తగినంత బలం లేకపోయినా ఊహించని విధంగా ఘన విజయాన్ని సాధించారు. మరోవైపు వైసీపీ తరపున పెనుమత్స సత్యనారాయణ, మర్రి రాజశేఖర్(Marri Rajasekhar), పోతుల సునీత, ఇజ్రాయెల్, ఏసురత్నం విజయం సాధించారు. అనురాధ విజయంతో వైసీపీ (YCP) అభ్యర్థులు కోలా గురువులు, జయమంగళలో ఒకరు ఓటమిపాలు కానున్నారు.
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉన్న వైసీపీకి టీడీపీ షాకిచ్చింది. ఒక స్థానాన్ని టీడీపీ (TDP) కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ(Panchumurti Anuradha) తనకు తగినంత బలం లేకపోయినా ఊహించని విధంగా ఘన విజయాన్ని సాధించారు. మరోవైపు వైసీపీ తరపున పెనుమత్స సత్యనారాయణ, మర్రి రాజశేఖర్(Marri Rajasekhar), పోతుల సునీత, ఇజ్రాయెల్, ఏసురత్నం విజయం సాధించారు. అనురాధ విజయంతో వైసీపీ (YCP) అభ్యర్థులు కోలా గురువులు, జయమంగళలో ఒకరు ఓటమిపాలు కానున్నారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీరిద్దరిలో ఎవరు గెలుపొందుతారనే ఉత్కంఠ నెలకొంది.
వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతుంది. అయినా తమ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ సీఎం జగన్ మాటే శిరోధార్యంగా భావిస్తూ ఉన్న నేత కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల వైసిపి కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్. గత ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి ని చేస్తానని కళామందిర్ సెంటర్లో వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నాలుగు సంవత్సరాలు నుండి మర్రి రాజశేఖర్ అభిమానుల నిరీక్షణ నేటికీ ఫలించింది. రాష్ట్రవ్యాప్తంగా 18 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులను సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ప్రకటించారు. ఈ జాబితాలో చిలకలూరిపేట నుండి మర్రి రాజశేఖర్ పేరు కూడా ఉండటంతో మర్రి రాజశేఖర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక మనిషిని అభిమానించాలంటే ఆ మనిషి చేసిన త్యాగం అంతర్లీలంగా చేసిన త్యాగం దాగి ఉంటుంది.
పది మంది ఒక వ్యక్తిని అనుసరిస్తున్నారంటే ఆ వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేసి వారి కోసం నిలబడి ఉండాలి. ఒక మనిషిని నమ్మతున్నమంటే ఆ వ్యక్తి తాను తన కోసం కాకుండా ఇతరుల కోసం నిలబడి ఉండాలి. వారి కష్టాల్లో అండగా ఉండి, వారి కన్నీళ్లు తుడిసి భరోసా అందించాలి. చిలకలూరిపేట (Chilakaluripet) నియోజకవర్గంలో అటువంటి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మర్రిరాజశేఖర్ (Marri Rajasekhar). పార్టీలు, పదవులు, అధికారం ఏవీ ఆయనను తాను నమ్ముకున్న ప్రజల నుంచి, అబిమానులు, కార్యకర్తల నుంచి దూరం చేయలేదు. నియోజకవర్గ అభివృద్ది కోసమే పాటు పడ్డారు. నియోజకవర్గంలో అంతర్గత రోడ్లు, లోలెవల్ చాప్టాలు, పసుమర్రు, నరసరావుపేట(Narasa Raopet), చిరుమామిళ్ల లాంటి పెద్ద బ్రిడ్జిలు మర్రి తో సాధ్యమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ ఒక్క బహిరంగ సభలో చెప్పిన మాటలే మర్రిరాజశేఖర్ మచ్చలేని వ్యక్తిత్వానికి, ప్రజల కోసం పరితపించిన విధానాన్ని స్పష్టం చేస్తుంది.