• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది’

కర్నూలు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ నాగరాజు ఆదివారం తెలిపారు. సంజయ్ గాంధీ నగర్‌లో దివ్యాంగ ఉద్యోగుల సంఘం, యువసేన కార్యాలయాలను ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణం, భవిత కేంద్రాల ద్వారా విద్య, వైద్య సహాయం, స్వయం ఉపాధికి సబ్సిడీలు అందిస్తున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రత్యేక కోటపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

March 22, 2026 / 03:46 PM IST

రహదారిపై కారు పల్టీ.. ఒకరికి తీవ్రగాయాలు

ASR: జీకేవీధి(మం) జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. పెదవలస నుంచి రింతాడ వస్తున్న కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. రహదారి కింద వైపు ఉన్న ఇళ్లవైపు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న వైసీపీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ హుటాహుటిన క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

March 22, 2026 / 03:42 PM IST

సీఎం సహాయనిధి పేదలకు వరం: ఎమ్మెల్యే

NDL: పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఆదివారం వెలుగోడు మండలం వేల్పనూరులో వివిధ మండలాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 48 లక్షల విలువగల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు.

March 22, 2026 / 03:40 PM IST

విజయదుర్గాదేవిని దర్శించుకున్న క్రికెటర్

కడప: నగరంలోని శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారిని భారత క్రికెట్ క్రీడాకారిణి నల్లపురెడ్డి శ్రీచరణి ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికి, పట్టు వస్త్రాలతో సన్మానించారు. చఆలయ నిర్వాహకులు సుధా దుర్గాప్రసాద్, వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు పాల్గొన్నారు. దేశానికి మరిన్ని విజయాలు సాధించాలని శ్రీచరణి ఆకాంక్షించారు.

March 22, 2026 / 03:40 PM IST

‘నకిలీ బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దు’

శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియా వాళ్ళు లేరని, ఏ ఇతర కులాలను గిరిజన జాబితాలో చేర్చరాదని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న నకిలీ బెంతు ఒరియా కులస్థులను ఎస్టీలుగా గుర్తించాలని, ఇటీవల అసెంబ్లీలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రకటన చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆ మేరకు పలాసలో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు.

March 22, 2026 / 03:39 PM IST

తెనాలిలో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

GNTR: తెనాలి త్రీ టౌన్ సీఐ సాంబశివరావు రౌడీషీటర్లు, పాత నేరస్థులకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. పట్టణ ప్రశాంతతకు భంగం కలిగించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని, రౌడీషీటర్లపై నిరంతరం పోలీసు నిఘా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

March 22, 2026 / 03:35 PM IST

క్రికెట్ బెట్టింగ్ కేసులో రూ.24 లక్షలు స్వాధీనం

ప్రకాశం: పేకాట, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్‌పై జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటివరకు నిర్వహించిన దాడుల్లో 41 పేకాట స్థావరాలు, 10 కోడి పందేలు కేంద్రాలు వెలుగుచూశాయి. మొత్తం 287 మందిని అదుపులోకి తీసుకుని భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో రూ.24 లక్షలు, పరికరాలు స్వాధీనం అయ్యాయి.

March 22, 2026 / 03:34 PM IST

ప్రమాదాల నివారణకు వినూత్న ప్రయత్నం..!

ELR: పెదపాడు సెంటర్లో రహదారి ప్రమాదాల నివారణకు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినారు. పెదపాడు ఎస్ఐ ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనదారుల్లో చైతన్యం తీసుకురావడానికి, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామన్నారు. అతివేగం, అజాగ్రత్త, హెల్మెట్ లేకపోవడం మీకు మాత్రమే కాకుండా ఎదుటివారికి కూడా ప్రాణాపాయం కలుగుతుందని స్పష్టం చేశారు.

March 22, 2026 / 03:34 PM IST

జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

TPT: APWJF ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన ప్రథమ మహాసభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జర్నలిస్ట్‌లకు త్వరలోనే ఇంటి స్థలాలు మంజూరు చేయిస్తామన్నారు. తిరుపతి రూరల్ ప్రెస్ క్లబ్ కోసం 25 సెంట్లు స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు, విలేకరులు పాల్గొన్నారు.

March 22, 2026 / 03:33 PM IST

స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై కరపత్రాలతో ప్రచారం

AKP: స్టీల్ ప్లాంట్ రాకతో అనకాపల్లి జిల్లా రూపురేఖలు మారతాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కూటమి నాయకులతో కలిసి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు.

March 22, 2026 / 03:32 PM IST

బలుసులమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: పన్నెండేళ్లకు ఒకసారి జరిగే తాడేపల్లిగూడెం పట్టణ పుర దేవత బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం అమ్మవారిని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం స్థానిక మాగంటి కళ్యాణమండపంలో టీడీపీ ఇంఛార్జ్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో హాజరయ్యారు.

March 22, 2026 / 03:32 PM IST

నందిగామలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభం

NTR: నందిగామ పట్టణంలోని కమ్మ కళ్యాణ మండపంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి & పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ప్రాణాంతక వ్యాధులపై ముందస్తు నిర్ధారణ ఎంతో ముఖ్యమని, క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలో గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని తెలిపారు.

March 22, 2026 / 03:30 PM IST

‘రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 22, 2026 / 03:30 PM IST

నీరు జీవనాధారం-ప్రతి నీటి బొట్టును సంరక్షిద్దాం: మంత్రి

కోనసీమ: నీరు మనిషి జీవనానికి ప్రాణాధారమని, నీరు లేకుండా జీవనం అసాధ్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా రామచంద్రపురంలో ఆదివారం మంత్రి రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేశారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను తమ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

March 22, 2026 / 03:30 PM IST

‘స్థానిక సంస్థల సమరానికి సమాయత్తం కావాలి’

VZM: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల సమరానికి సమాయత్తం కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం బొండపల్లి మండలంలోని నెలవాడలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో గజపతినగరం నియోజకవర్గస్థాయిలో పలువురు ప్రజాప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ సత్కారం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా నాయకులు ప్రజలుకు అందుబాటులో ఉండాలని సూచించారు.

March 22, 2026 / 03:21 PM IST