• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చుక్కలూరులో విశేష అలంకరణలో గంగమ్మ తల్లి

ATP: తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారు భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని రంగురంగుల పుష్పాలు, పట్టువస్త్రాలతో అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకను తిలకించేందుకు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

March 22, 2026 / 04:32 PM IST

కొలిమిగుండ్లలో CITU నాయకులు నిరసన..!

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సెంటర్లో ఇవాళ సీఐటీయు నాయకులు నరసింగరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. సిమెంటు పరిశ్రమలలో భూములు కోల్పోయిన వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని సీఐటీయు నాయకులు డిమాండ్ చేశారు. పరిశ్రమలలో భూ బాధితులకు ఉద్యోగాలు కల్పించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.

March 22, 2026 / 04:31 PM IST

రౌడీ షీటర్లకుసీఐ కౌన్సిలింగ్

NTR: ఇబ్రహీంపట్నంలో రౌడీ షీటర్లకు సీఐ సుబ్రహ్మణ్యం హెచ్చరిక జారీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కౌన్సిలింగ్‌లో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సత్ప్రవర్తనతో మెలిగి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని తెలిపారు. మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

March 22, 2026 / 04:31 PM IST

పిడుగుపాటుకు గురై పాడి రైతు మృతి!

PLD: అమరావతి(M) ఎండ్రాయిలో పిడుగుపాటుకు ఓ పాడి రైతు బలయ్యాడు. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ శనివారం సాయంత్రం గేదెలను మేపేందుకు పొలానికి వెళ్లగా, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా.. గట్టుపై పిడుగు పడి విజయ్ మృతి చెంది ఉండటం గమనించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

March 22, 2026 / 04:30 PM IST

వడ్డాదిలో స్కౌట్స్ గైడ్స్ శిక్షణ

AKP: వడ్డాదిలో విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒరియెంటేషన్ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఏపీజేఏసీ కన్వీనర్ వీవీ రామరాజు ఆధ్వర్యంలో స్వామి నాయుడు శిక్షణ అందించారు. క్రమశిక్షణ, నాయకత్వం, సేవాభావం, సామాజిక సేవ, ప్రథమ చికిత్స వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఇతరులకు సహాయం చేసే విధానాలు కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు రాంబాబు, వరప్రసాద్ పాల్గొన్నారు.

March 22, 2026 / 04:25 PM IST

రేపు రేషన్ కార్డుదారులకు కిరోసిన్..!

W.G: గ్యాస్ కొరత నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం రేపటి నుంచి లీటర్ చొప్పున కిరోసిన్ పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి 2,800 కిలో లీటర్ల కిరోసిన్‌ను అందించిన విషయం తెలిసిందే. సంక్షోభ పరిస్థితుల కారణంగా మళ్లీ సరఫరా చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

March 22, 2026 / 04:24 PM IST

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

SKLM: పోలాకి(మం), రేవు అంపలాం గ్రామంలో యోగి బ్రదర్స్ వారి ఇంట జరిగిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు పండగలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆదివారం హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.

March 22, 2026 / 04:24 PM IST

‘జిల్లాలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించాలి’

KRNL: జిల్లాలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించి, ప్రజలు ఇండక్షన్ స్టవ్, సోలార్, ఎలక్ట్రిక్ కుక్కర్ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా చూడాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి LPG గ్యాస్ అంశంపై డివిజన్, మండలస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ సూచనలు చేశారు.

March 22, 2026 / 04:23 PM IST

ఎంపీ బీదాపై మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు

NLR: తమిళనాడుకు చెందిన బోట్లను ఆంధ్రా మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే టీడీపీ నేతలు వాటిని దొంగచాటుగా వదిలేశారని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. స్వార్ధ రాజకీయాల కోసం టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు ఈ పని చేశారని ఆరోపించారు. మత్స్యకారుల సంక్షేమం మీద టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు.

March 22, 2026 / 04:20 PM IST

జాబ్ క్యాలెండర్‌తోనే ఉజ్వల భవిష్యత్తు: పెంకే బాబా

KKD: రాష్ట్ర యువత ఉజ్వల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తెలిపారు. ఆదివారం కాకినాడ రూరల్ 48, 49 వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ ద్వారా మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

March 22, 2026 / 04:20 PM IST

‘ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు’

KDP: ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని AP SC కమిషన్ సభ్యులు వెంకటప్ప అన్నారు. ఆదివారం UTF కార్యాలయంలో రాష్ట్ర గిరిజనాభివృద్ధి ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బద్వేలు నియోజకవర్గంలో STలకు చెందిన అసైన్ భూములు కబ్జాకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. అడవుల నుంచి వెదురు తెచ్చుకున్నప్పుడు అటవీ అధికారులు ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిపారు.

March 22, 2026 / 04:19 PM IST

బాలికపై లైంగిక దాడి.. తల్లి ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: మొలకలచెరువు(M) గూడుపల్లి గ్రామంలో 10 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబం నిలదీయగా, నిందితుడి బంధువులు దాడి చేసి బెదిరించినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటనతో బాలిక తల్లి భవాని గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

March 22, 2026 / 04:17 PM IST

‘సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం’

KRNL: ఆదోని నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు 30 మందికి రూ.12.63 లక్షల చెక్కులు అందజేశారు. గత 18 నెలల్లో 519 మందికి రూ.1.85 కోట్లు సహాయం అందినట్లు తెలిపారు. మరిన్ని అర్హులకు సహాయం కొనసాగుతుందని సీనియర్ నాయకులు పేర్కొన్నారు.

March 22, 2026 / 04:14 PM IST

గ్రామంలో నీటి సమస్యకు తక్షణ పరిష్కారం

TPT: ఎర్పేడు మండలం వికృతమాల గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తగా, దీనిని తెలుగు యువత అధ్యక్షులు పూల హేమాక్షి రాయల్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి గంటలోపే నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. దీంతో సంబంధిత అధికారులు తెలుగు గంగ పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేశారు.

March 22, 2026 / 04:13 PM IST

కనగానపల్లిలో కనకదాస కళ్యాణ మండపం పనుల పరిశీలన

సత్యసాయి: కనగానపల్లి మండలంలో హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కనగానపల్లి హెడ్‌ క్వార్టర్‌ వద్ద రూ.80 లక్షల ఎంపీ నిధులతో నిర్మిస్తున్న శ్రీ భక్త కనకదాస కళ్యాణ మండప నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్‌ పోతులయ్య, డీఈ లక్ష్మీనారాయణ, కనగానపల్లి ఎంపీటీసీ భాస్కర్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

March 22, 2026 / 04:00 PM IST