GNTR: తెనాలి సోనోవిజన్‌లో ఈ నెల 15న జరిగిన భారీ చోరీ కేసును టూ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముత్యంశెట్టిపాలెం, చినరావూరులకు చెందిన మైనర్లను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జనార్ధనరావు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 12 లక్షల విలువైన సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఐప్యాడ్లను స్వాధీనం చేసుకున్నారు.
CTR: వెదురుకుప్ప మండలం పాతగుంట పంచాయతీలో జల్లికట్టు కార్యక్రమాన్ని మండల టీడీపీ అధ్యక్షులు మోహన్ మురళి, సర్పంచ్ భువనేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా యువత ఉపాధ్యక్షులు చంద్రబాబు రెడ్డి తదితరులు పాల్గొని వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
NTR: సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు తమ రెవెన్యూ అర్జీలను ఈ క్లినిక్‌లలో అందజేయాలని సూచించారు.
ATP: గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గుర్తు తెలియని వృద్ధుడు ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడుకి ఎవరూ లేకపోవడంతో సమాచారం తెలుసుకున్న ఆ నలుగురు సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంజుల వెంకటేష్ అ అనాధ వృద్ధుడు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణ ప్రజలు ఆ నలుగురు సేవా సమితి సభ్యులను అభినందించారు.
VZM: బొబ్బిలి(మం) శివడవలస మాజీ సర్పంచ్ చప్ప రామస్వామినాయుడు, ఆయన సతీమణి అనారోగ్యం బారిన పడడంతో ఎమ్మెల్యే బేబినాయన వారిని ఆదివారం పరామర్శించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమకు అండగా ఉండే రామస్వామినాయుడు, సతీమణి అనారోగ్యానికి గురికావడం బాధ కలిగించినట్లు చెప్పారు.
SKLM: ఈ నెల 23న భగత్ సింగ్, రాజగురు సుఖ్ దేవ్‌ల 95వ వర్ధంతి కార్యక్రమం జయప్రదం చేయాలని బొడ్డపాడు యువజనసంఘం సభ్యులు అన్నారు. ఆదివారం దీనికి సంబంధించిన కరపత్రాలను పలాస(మం) బొడ్డపాడు అమర వీరులు స్మారక మందిరం వద్ద ఆవిష్కరించారు. అలాగే ఆ సంఘం 73వ వార్షికోత్సవం జరుగుతుందన్నారు.
KDP: జమ్మలమడుగు (M) ఎస్. ఉప్పలపాడు గ్రామానికి చెందిన తలారి మోహన్ గేట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆల్ ఇండియా 89వ ర్యాంక్ సాధించి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
E.G: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును కలిశారు. ఏప్రిల్ 2న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరగనున్న తన కుమార్తె డాక్టర్ సనాతనీ వివాహానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వివాహ ఏర్పాట్లపై కొద్దిసేపు వారిరువు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జనసేన జోనల్ కన్వీనర్ ఆర్. నాగు, తదితరులు ఉన్నారు.
కర్నూలు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎంపీ నాగరాజు ఆదివారం తెలిపారు. సంజయ్ గాంధీ నగర్‌లో దివ్యాంగ ఉద్యోగుల సంఘం, యువసేన కార్యాలయాలను ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణం, భవిత కేంద్రాల ద్వారా విద్య, వైద్య సహాయం, స్వయం ఉపాధికి సబ్సిడీలు అందిస్తున్నామన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రత్యేక కోటపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ASR: జీకేవీధి(మం) జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. పెదవలస నుంచి రింతాడ వస్తున్న కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. రహదారి కింద వైపు ఉన్న ఇళ్లవైపు కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉన్న వైసీపీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ హుటాహుటిన క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
NDL: పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. ఆదివారం వెలుగోడు మండలం వేల్పనూరులో వివిధ మండలాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 48 లక్షల విలువగల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు.
కడప: నగరంలోని శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారిని భారత క్రికెట్ క్రీడాకారిణి నల్లపురెడ్డి శ్రీచరణి ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఆమెకు ఘన స్వాగతం పలికి, పట్టు వస్త్రాలతో సన్మానించారు. చఆలయ నిర్వాహకులు సుధా దుర్గాప్రసాద్, వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు పాల్గొన్నారు. దేశానికి మరిన్ని విజయాలు సాధించాలని శ్రీచరణి ఆకాంక్షించారు.
శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరియా వాళ్ళు లేరని, ఏ ఇతర కులాలను గిరిజన జాబితాలో చేర్చరాదని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న నకిలీ బెంతు ఒరియా కులస్థులను ఎస్టీలుగా గుర్తించాలని, ఇటీవల అసెంబ్లీలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రకటన చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆ మేరకు పలాసలో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు.
GNTR: తెనాలి త్రీ టౌన్ సీఐ సాంబశివరావు రౌడీషీటర్లు, పాత నేరస్థులకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. పట్టణ ప్రశాంతతకు భంగం కలిగించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని, రౌడీషీటర్లపై నిరంతరం పోలీసు నిఘా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రకాశం: పేకాట, కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్‌పై జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటివరకు నిర్వహించిన దాడుల్లో 41 పేకాట స్థావరాలు, 10 కోడి పందేలు కేంద్రాలు వెలుగుచూశాయి. మొత్తం 287 మందిని అదుపులోకి తీసుకుని భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో రూ.24 లక్షలు, పరికరాలు స్వాధీనం అయ్యాయి.