కోనసీమ: వైసీపీ రాష్ట్ర రీజనల్ కో-ఆర్డినేటర్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఆదివారం మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరామర్శించారు. బొత్స ఇటీవల అస్వస్థతకు గురై చికిత్స అనంతరం విజయనగరంలోని ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలాని ఆకాక్షించారు.
ప్రకాశం: టంగుటూరులో ఆదివారం జరిగిన లారీ అసోసియేషన్ సమావేశానికి మంత్రి స్వామి హాజరయ్యారు. ట్యాక్స్‌ను చెల్లింపు, ఆర్టీఏ నిబంధనలతో తీవ్రంగా నష్టపోతున్నామని సరైన వ్యాపారాలు లేక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నామని లారీ అసోసియేషన్ సభ్యులు మంత్రికి తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి, తన వంతు సహాయం చేస్తానని అసోసియేషన్ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు.
GNTR: పినపాడు గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు కొండ్రు సాయి కుమార్ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. జనసేన పార్టీ తరఫున రూ.5,00,000 ప్రమాద బీమా పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
NTR: పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు పెట్రోల్ బంక్ సమీపంలోని పంట కాలువ వద్ద ఆదివారం మంచినీటి పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతుందని స్థానికులు తెలిపారు. వేసవికాలంలో సమీపిస్తున్న సమయంలో ఎలా నీళ్లు వృధాగా పోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
PPM: అకాల వర్షాలు కారణంగా నష్ట పోయిన మొక్కజొన్న రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు డిమాండ్ చేసారు. ఆదివారం పాచిపెంట(మం) పాంచాలి, మోసురు, మాతుమూరు గ్రామాలలో నేలకొరిగిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఎకరాకు రూ. 40 వేలు పెట్టుబడి పెట్టి, పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్ళు వర్షం వలన పూర్తిగా నష్ట పోయారన్నారు.
E.G: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరావు (72) తాజాగా మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 16కు చేరింది. కల్తీ పాలు తాగడంతో ఆయన రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు కొండబాబు (64) అనే వ్యక్తి మాత్రమే కోలుకున్నారు. పాలను నిల్వ చేసే ఫ్రీజర్‌లో ఇథిలీన్ గ్లైకాల్ కలవడంతోనే ఈ ఘోరం జరిగింది.
విశాఖలో గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా, దేవాలయాల్లో పక్షులకు ధాన్యం కుంచులు, తాగునీటి పాత్రలు, గూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా, విద్యార్థులతో విభిన్న ప్రాంతాలలో కొండల మీద, సముద్ర తీరంలో మొక్కలు నాటడం, సీడ్ బాల్స్ చల్లడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రకాశం: టంగుటూరు మండలం జయవరంలో అనారోగ్యంతో మరణించిన శ్రీదేవి మృతదేహాన్ని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదివారం పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీదేవి గ్రామంలో వైసీపీ పార్టీ బలపడేందుకు కృషి చేసిందని అన్నారు. ఆమెలేని లోటు పార్టీకి తీరనిదని అన్నారు
SKLM: బూర్జ(M) ఓవీపేట ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బొడ్డేపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 30లోపు పదవ తరగతి విద్యార్థులు https://ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
AKP: వైసీపీ మండల నాయకుల సమావేశం ఆదివారం మునగపాకలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. జగన్ నమ్మకాన్ని చోరగొనే విధంగా పని చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత విభేదాలు పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు.
GNTR: అకాల ఈదురు గాలులతో కూడిన వర్షాలు గత రెండు రోజులుగా కురుస్తున్న కారణంగా కాకుమాను మండలంలో ఎకరాల కొద్దీ సాగు చేసిన మొక్కజొన్న పంట నేలకూలిపోయింది. పంట పూర్తిగా పడిపోవడంతో దిగుబడి తీవ్రంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
KDP: ఖాజీపేట(M) నాగసానిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో DSP రాజేంద్ర ప్రసాద్, సీఐ వంశీధర్‌లు వివరాలు వెళ్లడించారు. 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో నలుగురు నిందితులు పారిపోయినట్లు పేర్కొన్నారు.
KRNL: ఆదోని సుందరయ్య భవన్ నిర్మాణానికి కల్లుబావి ప్రాంతానికి చెందిన సీపీఎం మాజీ కౌన్సిలర్ పీ.ఎస్.ముత్తమ్మ రూ. 20 వేల విరాళం ఆదివారం అందజేశారు. ఈ మొత్తాన్ని సీపీఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్నకు, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్నతో పాటు నాయకులు కృష్ణమూర్తి, సమక్షంలో అందించారు. ముత్తమ్మ సహకారానికి సీపీఎం పట్టణ కమిటీ కృతజ్ఞతలు తెలిపారు.
TPT: తిరుపతిలో నిర్వహించిన దక్షిణ ప్రాంత ప్రాంతీయ కౌన్సిల్ సమావేశం, అడ్వకేసీ వర్క్‌షాప్‌లో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతిని దేశంలో ప్రముఖ ల్యాండ్ మార్క్‌గా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. వైద్య రంగంలో అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.