• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘తప్పులతడకగా పోస్టుల భర్తీ’

ASR: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీ ఇంటికి మీ డాక్టర్’ ప్రాజెక్టు ద్వారా, మొబైల్ క్లినిక్ ఏర్పాటు కోసం నాలుగు పోస్టులు తీయడం జరిగిందని ఏఐటీయూసీ జిల్లా కో కన్వీనర్ అమర్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఆదివారం పాడేరులో మాట్లాడుతూ.. డాక్టర్, ఫార్మాసిస్ట్, స్టాఫ్ నర్స్, డ్రైవర్ పోస్టులను తప్పులతడకగా భర్తీ చేశారన్నారు.

March 22, 2026 / 02:00 PM IST

నందిగామలో దివ్యాంగులకు ఉచిత వీల్ చైర్లు పంపిణీ

NTR: నందిగామలో పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వీల్‌చైర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని, దివ్యాంగులకు ఉచిత వీల్‌చైర్లు అందజేశారు. దివ్యాంగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి అవసరమైన సహాయక పరికరాలు అందించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు.

March 22, 2026 / 02:00 PM IST

‘నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు’

ATP: వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తి సీఐ రామారావు పట్టణ ప్రజలకు హెచ్చరించారు. ఆదివారం సీఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటిస్తూ… ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.

March 22, 2026 / 01:40 PM IST

ఆలయానికి రూ.5 లక్షల విలువైన వెండి వస్తువులు వితరణ

CTR: పులిచెర్ల మండలం మంగళంపేటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి చిత్తూరుకు చెందిన దాత కస్తూరి రంగన్ రోహిణి రంగన్ దంపతులు రూ.5 లక్షలు విలువైన వెండి వస్తువులు వితరణ చేశారు. ఆలయానికి చేసిన వీరికి స్వామి దర్శనం కల్పించారు. అనంతరం శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అర్చకులు శేషాద్రి ఆచార్యులు, సర్పంచ్ మధు, భక్తులు పాల్గొన్నారు.

March 22, 2026 / 01:38 PM IST

‘నర్సీపట్నంకు మరో రూ.8 కోట్లు మంజూరు’

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం తెలిపారు. గత రెండేళ్లలో రూ.24 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలతో కలిపి 341 పనులు పూర్తయ్యాయని చెప్పారు. తాజాగా VMRDA ద్వారా మరో రూ.8 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. 28 వార్డుల్లో 81 పనులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పుకొచ్చారు.

March 22, 2026 / 01:32 PM IST

‘ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్’

VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 22, 2026 / 01:27 PM IST

వేగం కన్నా ప్రాణం ముఖ్యం: ట్రాఫిక్ ఎస్సై ఆరోన్

PKSM: మార్కాపురం ట్రాఫిక్ ఎస్సై ఆరోన్ వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ‘వేగం కన్నా ప్రాణం ముఖ్యం’ అని తెలిపారు. ఇవాళ దోర్నాల బస్టాండులో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు. కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వాహనదారులు సిగ్నల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు..

March 22, 2026 / 01:13 PM IST

ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR : నందిగామ పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన సంస్థ వారికి కృతజ్జతలు తెలిపారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

March 22, 2026 / 01:13 PM IST

‘ప్రతి బొట్టు ఒడిసి పడదాం’

NLR: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గ్రంథాలయ పాలనాధికారి ఏ. నరసింహారావు అన్నారు. బుచ్చి శాఖ గ్రంధాలయంలో ఆదివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీటి పొదుపు నినాదంగా కాకుండా విధానంగా మారాలన్నారు. నీటి సంరక్షణపై బాల్యంలోనే పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని కోరారు.

March 22, 2026 / 01:13 PM IST

‘యుద్ధ నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి’

AKP: ప్రపంచ దేశాలు యుద్ధ నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఆదివారం రాంబిల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల్లో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపాయి. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దేవుడు నాయుడు మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా ఆయిల్, గ్యాస్, నిత్యవసర వస్తువులు ధరలు పెరగడంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.

March 22, 2026 / 01:10 PM IST

‘భూగర్భజలాలు పరిరక్షణ మనందరి బాధ్యత’

SKLM: భూగర్భజలాలు పరిరక్షణ మనందరి బాధ్యతని భూగర్భజల శాఖ సహాయ సంచాలకులు(RTD) దుప్పల లక్ష్మణరావు అన్నారు. ప్రపంచ జలదినోత్సవ వేడుకలు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏజీవి అయినా సజీవంగా జీవించాలంటే జలమే ఆధారమని, ప్రతీఒక్కరూ జలసంరక్షణకు శక్తివంచన లేకుండా పాటుపడాలన్నారు. నీటిని దుర్వినియోగంచేస్తే భవిష్యత్ తరాలకు నీరుండదన్నారు.

March 22, 2026 / 01:10 PM IST

తెనాలిలో ప్రముఖులకు ‘కీర్తి కిరీటం’సత్కారం

GNTR: తెనాలి రత్నా కళ్యాణ మండపంలో ఈ నెల 31న ‘మా-ఏపీ’ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘అష్ట దిగ్గజాలకు కీర్తి కిరీటం’ పేరిట వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ప్రముఖులను సత్కరించనున్నారని దర్శకుడు దిలీప్ రాజ తెలిపారు. కలెక్టర్ అన్సారియా ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ సహా పలువురికి పురస్కారాలు అందజేయనున్నారు.

March 22, 2026 / 01:10 PM IST

ఈ నెల 24న బియ్యం, బేడల వేలం పాట

ATP: పెద్దపప్పూరు మండల కేంద్రంలో మాఘమాసంలో జరిగిన తిరుణాల సందర్భంగా భక్తులు స్వామి వారికి సమర్పించిన బియ్యం, బేడల వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం ఆదివారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 24న స్వామివారికి సమర్పించిన బియ్యం, బేడలు, ఆలయ భూముల కౌలు వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ వేలం పాటలో పాల్గొనవచ్చు పేర్కొన్నారు. 

March 22, 2026 / 01:10 PM IST

ఈ నెల 23న భారీ జాబ్ మేళా

E.G: తాళ్లపూడిలోని కరిబండి డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ మేళాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. నిరుద్యోగ యువత, పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు.

March 22, 2026 / 01:08 PM IST

రోడ్డు మధ్యలో స్తంభం.. రాకపోకలకు ఇబ్బంది

పార్వతీపురం(మం) నర్సిపురంలోని ఓ వీధిలో రహదారి మధ్యలోనే విద్యుత్తు స్తంభం ఉండటం స్థానికులకు ఇబ్బందిని కలిగిస్తోంది. రోడ్డు, కాలువల పనులు జరిగినప్పటికీ స్తంభాన్ని మార్చకుండా వదిలేయడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించి స్తంభాన్ని పక్కకు తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

March 22, 2026 / 01:07 PM IST