PKSM: మార్కాపురం ట్రాఫిక్ ఎస్సై ఆరోన్ వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ‘వేగం కన్నా ప్రాణం ముఖ్యం’ అని తెలిపారు. ఇవాళ దోర్నాల బస్టాండులో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన ద్విచక్ర వాహనదారులకు జరిమానా విధించారు. కొత్తగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. వాహనదారులు సిగ్నల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు..