SDPT: భద్రాచల సీతారాముల కళ్యాణానికి అందించే కోటి తలంబ్రాల దీక్షలో భాగంగా ఇవాళ గజ్వేల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజమౌళి అనసూయ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఓలిచి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజుకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గోటి తలంబ్రాల్లో రామకోటి రామరాజు కృషి అమోఘం అని పేర్కొన్నారు.