E.G: తాళ్లపూడిలోని కరిబండి డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ మేళాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. నిరుద్యోగ యువత, పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు.