నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో ఓ సినిమా చేయనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. ఆత్రేయ చెప్పిన కథ నచ్చడంతో కొత్త ప్రాజెక్ట్‌కు బాలయ్య అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో దర్శకుడు ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రీ-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసినట్లు తెలిసింది.