TG: రాష్ట్ర బడ్జెట్లో అన్నివర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్ల బడ్జెట్లో ఇప్పటివరకు రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఎద్దేవా చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. బీసీలకు మరిన్ని మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.