AP: కూటమి ప్రభుత్వం మత్స్యకారులపై అమానుషంగా వ్యవహరిస్తుందని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర మత్స్యకారులు నిర్భంధించిన తమిళనాడు బోట్లను రాజకీయ లబ్ధి కోసం వదిలిపెట్టేశారన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న స్వార్థపూరిత రాజకీయాలపై మండిపడ్డారు. తమిళనాడు నుంచి బోట్లు వచ్చి రాష్ట్ర మత్స్య సంపదని అక్రమంగా దోచుకుంటున్నాయన్నారు.