BDK: బూర్గంపాడు మండలంలో అక్రమ మద్యం విక్రయాలు విస్తృతంగా జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుడులు, పాఠశాలల సమీపంలో కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.