MHBD: కురవి మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మింగు సమ్మయ్య ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం వారి నివాసానికి వెళ్లి సమ్మయ్యను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.