W.G: శక పురుషుడు శాలివాహనుడి జయంతిని జిల్లాలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సొసైటీ రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చక్రవర్తి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గురుజుకోట రాకేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
VZM: శనివారం వేపాడ మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో పంట పొలాలు, రహదారులంతా జలమయంగా మారాయి. అక్కడక్కడా రోడ్లు చెరువులను తలపించాయి. అకాల వర్షాలతో పట్టణ వాసులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
KRNL: రోగులకు సీఎం సహాయనిధి పెద్ద భరోసా అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. నంద్యాలలో ఎంపీ బైరెడ్డి శబరి సిఫారసుతో మంజూరైన నిధులను ఇవాళ పంపిణీ చేశారు. వివిధ నియోజకవర్గాల నుంచి 22 మందికి మొత్తం రూ. 24.27 లక్షల చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
W.G: వీరవాసరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సుకు ఆదివారం పూలపల్లి నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీరాజు ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీడ్ రేట్లు తగ్గకపోవడం, రొయ్య ధరలు పెరగకపోవడం, దళారుల దోపిడీపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.
W.G: వీరవాసరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సుకు ఆదివారం పూలపల్లి నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీరాజు ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీడ్ రేట్లు తగ్గకపోవడం, రొయ్య ధరలు పెరగకపోవడం, దళారుల దోపిడీపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.
W.G: వీరవాసరంలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సుకు ఆదివారం పూలపల్లి నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీరాజు ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీడ్ రేట్లు తగ్గకపోవడం, రొయ్య ధరలు పెరగకపోవడం, దళారుల దోపిడీపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.
CTR: చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు.
KDP: జమ్మలమడుగు మండలం భీమరాయుని కొట్టాలలో నూతనంగా నిర్మించనున్న మారెమ్మ తల్లి, సేవలాల్ మహారాజ్ దేవాలయాలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు. దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభం కావడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తూ, అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అన్నమయ్య: ప్రతి సోమవారం నిర్వహించే PGRS కార్యక్రమం ఇకపై నూతన జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. ఆధునిక వసతులతో కూడిన ఈ కార్యాలయంలో ఫిర్యాదుదారులు నేరుగా తమ సమస్యలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ప్రతి సమస్యను అధికారులతో కలిసి విజయవంతంగా పరిష్కరిస్తామని తెలిపారు.
ATP: గుత్తి మండల వ్యాప్తంగా డొమెస్టిక్ లేదా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కావాల్సిన వారు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుని సిలిండర్లు పొందాలని ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఎవరూ కూడా గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లవద్దన్నారు. ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
KRNL: హాలహర్వి మండలం సిరుగాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కుమ్మరి వనప్ప అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
PLD: రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో దుర్గి మార్కెట్ యార్డ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే వివరించారు.
ప్రకాశం: కొండపి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బోధవాటి సోమయ్య అనారోగ్యానికి గురై మెడిక్యూర్ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా మంత్రి స్వామి ఆదివారం ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో మాట్లాడారు. సోమయ్యకు మంత్రి స్వామి డాక్టర్ కావడంతో పలు సూచనలు చేశారు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
GNTR: జిల్లా ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కారం కోసం పబ్లిక్ గ్రీవెన్స్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. ‘మీ కోసం’ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి సోమవారం జిల్లాలో PGRS, రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జరిగిన 104 ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా జట్టు ఘనవిజయం సాధించింది. అనంతపురం జట్టుతో జరిగిన ఉత్కంఠ పోరులో 19 పరుగుల తేడాతో గెలుపొందింది. గంగులప్ప 39 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నారు. బౌలింగ్‌లో విజయ్, నాగార్జున తలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు.