• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కుంభాభిషేకంలో మాజీ ఎమ్మెల్యే

CTR: పలమనేరు అర్బన్ బోడిరెడ్డిపల్లిలో శ్రీ సీతారాముల దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ, మహా కుంభాభిషేక కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరి సహకారంతో నిర్మించిన ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లాలని కోరారు. మహా పూర్ణాహుతి, కుంభాభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.

March 25, 2026 / 12:42 PM IST

‘అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం’

KRNL: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాలను తక్షణమే ఇవ్వాలని సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, AIKS జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయ డిమాండ్ చేశారు. ఇవాళ పెద్దకడబూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లను అందజేయాలన్నారు.

March 25, 2026 / 12:41 PM IST

రొంపిచర్లలో గాలికుంటు వ్యాధి నివారణకు వ్యాక్సిన్ పంపిణీ

PLD: రొంపిచర్ల మండలంలోని కొనకంచివారి పాలెం గ్రామంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా వ్యాక్సిన్ మందులను నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పంపిణీ చేశారు. పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

March 25, 2026 / 12:41 PM IST

‘విద్యార్థుల ప్ర‌తిభ దేశాభివృద్ధికి వినియోగించాలి’

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని, విద్యార్థులు తమ ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తి, తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.

March 25, 2026 / 12:41 PM IST

శక్తి యాప్ అవగాహన కార్యక్రమం

SKLM: మీ మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్ ఉంటే పోలీస్ రక్షణ ఉన్నట్లే అని టెక్కలి డివిజన్‌కు చెందిన శక్తి టీం కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. కోటబొమ్మాళి(మం) హట్కో కాలనీ బ్రాడ్‌లా స్కూల్లో యాప్‌పై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహన చోధకులు ప్రయాణం చేయరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.

March 25, 2026 / 12:41 PM IST

RSKలను తనిఖీ చేసిన డివిజన్ డిప్యూటీ డైరెక్టర్

ATP: నార్పల మండలంలోని పప్పూరు, దుగుమర్రి గ్రామపంచాయతీలలోని RSKలను అనంతపురం డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ రమేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. RSKలలోని రికార్డులను వారు పరిశీలించారు. RSKల పరిధిలో వారు చేపడుతున్న కార్యక్రమాలను సిబ్బందిని అడిగి ఆయన తెలుసుకున్నారు. వేసవి సమయంలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

March 25, 2026 / 12:37 PM IST

నూతన పోలీస్ స్టేషన్ భవనానికి భూమి పూజ

సత్యసాయి: లేపాక్షిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ బుధవారం భూమి పూజ చేశారు. సీఎస్ఆర్ నిధుల సహకారంతో ఆధునిక సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేసేందుకు పై అంతస్తులో సర్కిల్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

March 25, 2026 / 12:36 PM IST

ఒంటిమిట్టలో హరిద్ర ఘటనం ప్రారంభం

కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం హరిద్ర ఘటనం కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి శుభారంభంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 25, 2026 / 12:36 PM IST

తేనెటీగల దాడి.. కానిస్టేబుల్ మృతి

NDL: శ్రీశైలం డ్యాం వద్ద తేనెటీగల దాడి విషాదం సృష్టించింది. విధి నిర్వహణలో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి (52)పై తేనెటీగలు దాడి చేశాయి. లిఫ్ట్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా ఘటన చోటుచేసుకుంది. భయంతో కిందపడిన ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 25, 2026 / 12:36 PM IST

రేపు మార్కెట్ బహిరంగ వేలం పాట

PPM: సీతంపేట గ్రామ పంచాయతీ వారపు సంత, రోజువారీ మార్కెట్ బహిరంగ వేలం పాటను ఈనెల 26న నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి బీ. రామకృష్ణ తెలిపారు. ఈ నెల 25న జరగాల్సినప్పటికీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పర్యటన నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆశీలు వసూళ్లకు సంబంధించి ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చునని కోరారు.

March 25, 2026 / 12:35 PM IST

జి్ల్లాలో ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యం

CTR: గుడిపాల (M)నికి చెందిన ఓ మైనర్ బాలిక చిత్తూరులో అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. బాలిక 23వ తేదీ కాలేజీకి వెళ్లొస్తానంటూ ఇంటి నుంచి బయలుదేరి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు. పలమనేరు మండలానికి చెందిన మరో బాలిక సైతం ఆదివారం చిత్తూరులో మిస్సయిన ఘటనపై కేసు నమోదు అయింది.

March 25, 2026 / 12:33 PM IST

నీటి కుంటలో పడి వృద్ధురాలు మృతి

ప్రకాశం: గిద్దలూరు మండలం నరవ గ్రామ సమీపంలోని నీటి కుంటలో పడి ఓ గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 25, 2026 / 12:30 PM IST

సామాజిక భవనానికి మరమ్మతులు ప్రారంభం

AKP: గొలుగొండ(మం) కృష్ణదేవిపేటలో శిధిలావస్థలో ఉన్న సామాజిక భవనం మరమ్మతులు, ప్రహరీ గోడ, సీసీ రోడ్డు పనులను ఎంపీపీ గజ్జల మణికుమారి, సర్పంచ్ పందిరి సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. ఎంపీపీ నిధులలో భవనం మరమ్మతులకు రూ.5 లక్షలు, సీసీ రోడ్డు పనులకు రూ.2.5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 25, 2026 / 12:29 PM IST

ఈ నెల 31న మెగా జాబ్ మేళా

శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాలలో మార్చి 31న రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 15 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 500పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు.

March 25, 2026 / 12:28 PM IST

పొన్నలూరులో ఉచిత పశు వైద్య శిబిరం

ప్రకాశం: పొన్నలూరు మండలం మాలపాడులో మార్కెట్ కమిటీ యార్డ్ వారి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. బుధవారం డాక్టర్ శివరామకృష్ణ పశువులకు గాలికుంట వ్యాధులు రాకుండా టీకాలు వేశారు. పశువులకు సీజనల్ వ్యాధులు సోకకుండా గ్రామస్తులకు జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ కర్నా తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

March 25, 2026 / 12:25 PM IST